వన్డే వరల్డ్ కప్‌లో ఇండియా జోరు కొనసాగుతుండగా.. విరాట్ వీర లెవ్లో విరుచుకు పడుతున్నాడు. రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌పై సెంచరీ చేసి మరో ఘనతను సాధించాడు. అంతేకాదు సచిన్ రికార్డును చిత్తు చిత్తు చేశాడు.
Kohli: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా తన 50వసెంచరీని పూర్తిచేశాడు. ప్రపంచకప్ ట్రోఫీలో ఇప్పటి వరకు 3 సెంచరీలు బాదాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఎవరూ సాధించలేరు అనుకున్న దానిని విరాట్ కోహ్లీ సాధ్యం చేసి చూపించాడు. ఈ క్రమంలో వన్డేల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును వన్డే ప్రపంచకప్ 2023లో కోహ్లీ చిత్తు చిత్తు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ 120 బంతుల్లో 100 మార్క్ అందుకున్నాడు. దాంతో కోహ్లీ ఖాతాలో 49వ సెంచరీ చేరింది. సచిన్ 452 ఇన్నింగ్స్‌ల్లో 49 శతకాలు చేయగా విరాట్ 277 ఇన్నింగ్స్‌ల్లోనే 49 సెంచరీలు చేశాడు. ప్రస్తుతం 278వ ఇన్నింగ్స్‌లో 50 సెంచరీలు చేశాడు.