»Netizens Criticize Pakistan Ex Cricketer Abdul Razzaq
Netizens Fire: అబ్దుల్ రజాక్ నోటి దూల.. ఐశ్వర్యపై కామెంట్స్
నటి ఐశ్వర్యరాయ్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్లు సరి కాదని, రజాక్ తీరు మార్చుకోవాలని నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.
Netizens Fire: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ (Abdul Razzaq) నోరు పారేసుకున్నాడు. వరల్డ్ కప్‌లో తమ జట్టు చెత్త ప్రదర్శనతో లీగ్ నుంచే ఇంటి ముఖం పట్టింది. దీంతో సహనం కోల్పోయిన రజాక్.. ఓ టీవీ చర్చలో పాల్గొని.. పాక్ క్రికెట్ బోర్డును తప్పుపట్టారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ గురించి చులకనగా మాట్లాడారు. ఆ కామెంట్లతో నెటిజన్లు ఏకీపారేస్తున్నారు. రజాక్ తీరుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
షాహిద్ ఆఫ్రిది, ఉమర్ గిల్ సమక్షంలో రజాక్ మీడియాతో మాట్లాడారు. తాము ఆడిన సమయంలో యూనిస్ ఖాన్ కెప్టెన్‌గా ఉండేవాడు. అతను జట్టును నడిపిన తీరు ఉత్తమంగా ఉండేది. అతనితోపాటు సహచరుల నుంచి తాను స్ఫూర్తి పొందానని వివరించారు. అందుకోసమే పాకిస్థాన్ క్రికెట్ కోసం కొంతైనా చేయగలిగానని పేర్కొన్నారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదన్నారు. వరల్డ్ కప్ తర్వాత జట్టుతోపాటు ఆటగాళ్లపై విమర్శలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.
ఇంతవరకు ఓకే కానీ.. ఆ తర్వాత నోటిదూలను ప్రదర్శించాడు. నటి ఐశ్వర్యరాయ్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల మంచి, పవిత్రమైన పిల్లలు పుడతారని అనుకుంటే ఎలా..? అది ఎప్పటికీ జరగదని కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలను నెటిజన్లు ఖండిస్తున్నారు. రజాక్ రోజు రోజుకి దిగజారి పోతున్నాడని మండిపడ్డారు. అందుకే చదువుకోవాలని చెప్పేదని మరొకరు రాశారు. థర్డ్ క్లాస్ స్టేట్ మెంట్ ఇవ్వడం దారుణం.. పక్కన ఉన్న షాహిద్ ఆఫ్రిది నవ్వడం మరి దారుణం.. ఇది వారి మీడియా పరిస్థితి.. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నెటిజన్లు మండిపడ్డారు.
రైడింగ్ చేయడం రాని వ్యక్తి బండిని నడిపినట్టు ఉంటుంది. స్టేజ్ మీద ఉన్న వారు క్రికెటర్లు కాకపోయి ఉంటే.. మాట్లాడేందుకు వేదిక కూడా ఉండదని మరొకరు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల సోషల్ మీడియాలో పేరు వస్తోందని రజాక్ భావించి ఉన్నాడు.. అందుకే మీ దేశ ప్రజలకు ఆదర్శంగా లేవని మండిపడ్డారు.