ఆసియా క్రీడల్లో పీవీ సింధు(PV Sindhu) నిరాశ పరిచింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. చైనాకు చెందిన హీ బింగ్‌జియావో(He Bingjiao) చేతిలో ఓడిపోయి ఈవెంట్ నుంచి నిష్క్రమించింది.
ప్రపంచ కప్‌కు ముందే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దారుణమైన నిర్వహణ తీరు బట్టబయలైంది. ప్రేక్షకుల సీట్లపై అనేక చోట్ల పక్షుల రెట్టలు అలాగే ఉన్న ఓ వీడియో చూసిన నెటిజన్లు అధికారుల తీరుపై కామెంట్లు చేస్తున్నారు. ఇందులో అవినీతి జరిగిందని దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.
ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత క్రమశిక్షణతో జట్టును నడిపిస్తున్నాడో తెలపడానికి ఈ ఉదాహారణ చాలు అనిపిస్తుంది. గత 9 నెలలుగా అతడి ఫోన్లో ఆ రెండు పాపులర్ యాప్స్ లేవట. ఏదైనా పోస్ట్ చేయాలన్నా అది తన వైఫ్ చూసుకుంటుందని పేర్కొన్నారు.
హైదరాబాద్ బిర్యానీపై పాకిస్థాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్(Shadab Khan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ICC ప్రపంచ కప్ 2023కి ముందు హైదరాబాద్లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ, చివరి వార్మప్ గేమ్‌లో మెన్ ఇన్ గ్రీన్ జట్టు ఓడిపోవడంతో ఈ కామెంట్లు చేశారు.
ఆసియా క్రీడలు 2023లో 11వ రోజు భారత్ పతకాల ఖాతాలోకి మరో స్వర్ణాన్ని చేర్చింది. అర్చరీ విభాగంలో జ్యోతి సురేఖ వెన్నమ్, ప్రవీణ్ ఓజాస్ సంయుక్తంగా దక్షిణ కొరియాకు చెందిన జట్టను ఓడించి గోల్డ్ గెల్చుకున్నారు.
ఆసియా క్రిడాల్లో భారత్ సత్తా చాటుతుంది. లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్‌లో బంగారు పతకం ఇండియాకు దక్కింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు భారత్ 14 పసిడి పతకాలను కైవసం చేసుకుంది.
ఆసియా క్రీడల్లో టీమిండియా సత్తా చాటింది. టీ20లో నేపాల్ జట్టును 23 పరుగుల తేడాతో ఓడించి సెమీస్‌కు చేరింది. భారత ఆటగాడు యశస్వి జైస్వాల్ 49 బంతుల్లోనే 100 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు.
ఆసియా గేమ్స్ 2023లో భారత్ జోరు కొనసాగిస్తోంది. విత్యా రాంరాజ్ మహిళల 400 మీటర్ల హర్డిల్ రేసులో 55.42 స్కోరును నమోదు చేసి.. 1984 నాటి దిగ్గజ భారత అథ్లెట్ PT ఉష జాతీయ రికార్డును సమం చేసింది.
ఆసియా క్రీడల అథ్లెటిక్స్ ఈవెంట్‌లో భారత్ తొలి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. పురుషుల 3,000 మీటర్ల స్టీపుల్‌చేజ్ రేసులో భారత్‌కు చెందిన అవినాష్ సేబుల్ 8:19:53 టైమింగ్‌తో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
50 కేజీల విభాగంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో నిఖత్ జరీన్ థాయ్‌లాండ్ బాక్సర్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత వెటరన్ నిఖత్ జరీన్ 2-3 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. దక్షిణ కొరియా మహిళల జట్టుతో జరిగిన ముఖ్యమైన మ్యాచ్‌లో భారత జట్టు మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించడంలో విజయం సాధించింది.
ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 5 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.