ఈరోజు ప్రధానంగా ఆసియా క్రీడల్లో పాకిస్తాన్ ఓటమి, భారత్ గెలుపు అదే కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఇప్పటికే ఈరోజు ఉదయం స్క్వాష్ ఫైనల్లో భారత్ గెలుపొందగా..తాజాగా హాకీలో కూడా పాకిస్తాన్ జట్టుపై 10-2 తేడాతో ఇండియా విజయం సాధించింది. అంతేకాదు SAFF U19 ఛాంపియన్‌షిప్ ఫైనల్లో కూడా భారత్..పాకిస్థాన్ టీంను ఇండియా ఓడించి గోల్డ్ గెల్చుకుంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 20వ తేదిన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలను కూడా వెల్లడించనున్నారు.
ఆసియా క్రీడల్లో(asian games 2023) స్క్వాష్ ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్ ను ఓడించి భారత్ స్వర్ణ పతకం గెల్చుకుంది. పాకిస్తాన్ జట్టును 2-1 తేడాతో ఓడించింది.
భారత్‌లో వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు వన్డేల్లో చాలా మంచి ఫామ్‌లో కనిపించింది. ప్రపంచకప్‌లో భారత్ నుంచి కూడా అభిమానులు ఇలాంటి మంచి ప్రదర్శన ఆశిస్తున్నారు.
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఈసారి టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో రోహన్ బోపన్న, రుతుజా భోసలే జోడీ స్వర్ణం సాధించింది. ఫైనల్లో భారత జోడీ 2-6, 6-3, 10-4తో తైపీ జోడీని ఓడించింది.
ODI ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ప్రపంచ కప్‌కు ముందు వన్డేల్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసి రికార్డు సృష్టించిన ఆటగాడి గురించి తెలుసుకుందాం.
ఈ సారి ప్రపంచ కప్‌ను ఇంగ్లాండ్ గెలుస్తోందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఆ జట్టు అన్నీ విభాగాల్లో బాగుందని.. ముగ్గురు ఆల్ రౌండర్లు ఉండటం ఆ టీమ్‌కు కలిసి వస్తోందని అంచనా వేశారు.
విరాట్ భార్య అనుష్క శర్మ రెండవ బిడ్డకు జన్మనివ్వబోతోందని తెలుస్తోంది. అంటే అనుష్క, విరాట్‌లు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.
ఆసియా క్రీడలు 2023లో భారత అథ్లెట్ల అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పుడు భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మహిళల 45 నుంచి 50 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీ ఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది.
న్యూజిలాండ్‌తో జరిగిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో బాబర్ అజామ్ 84 బంతుల్లో 80 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో బాబర్ బ్యాట్ నుంచి 8 ఫోర్లు, 2 సిక్సర్లు వచ్చాయి.
వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు రోహిత్ శర్మ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ 17 ఇన్నింగ్స్‌ల్లో 65.20 సగటుతో 987 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను 6 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేశాడు.
ఆసియా క్రీడలు 2023(asian games 2023)లో నేడు ఆరవరోజు ఉదయం భారత ఆటగాళ్లు వావ్ అనిపించారు. ఏకంగా ఐదు పతకాలను కైవసం చేసుకున్నారు. వాటిలో రెండు స్వర్ణ పతకాలు షూటింగ్లోనే రావడం విశేషం. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.