Sri Lanka: వన్డే వరల్డ్ కప్లో టీమిండియా దూకుడు కొనసాగుతోంది. శ్రీలంకతో (Sri Lanka) జరిగిన లీగ్ మ్యాచ్లో టాస్ ఓడింది. బ్యాటింగ్కు వచ్చిన భారత్కు ఆదిలోనే షాక్ తగిలింది. మంచి ఫామ్లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ 4 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత గిల్, కోహ్లి ఇద్దరూ ఆచి తూచి ఆడారు. 92 పరుగులు చేసి గిల్ వెనుదిరిగాడు. కోహ్లి కూడా 88 రన్స్ చేసి క్యాచ్ ఇచ్చాడు. తర్వాత వచ్చిన రాహుల్ 21, సూర్యకుమార్ యాదవ్ 12 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా 35 పరుగులు చేసి ఔటయ్యాడు. నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 357 పరుగులు చేసింది. ప్రత్యర్థికి 358 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ మ్యాచ్ గెలిస్తే.. టీమిండియా సెమీ ఫైనల్కు అర్హత సాధిస్తోంది. వరల్డ్ కప్లో ఇప్పటివరకు భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది.