వరల్డ్ కప్లో మాంచి ఊపు మీదుంది టీమ్ ఇండియా. జట్టు విజయాల గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో ముచ్చటించారు. నాయకుడిగా ఏ నిర్ణయం తీసుకున్న.. ఆ క్రెడిట్ సభ్యులకు కూడా దక్కుతుందని చెబుతున్నారు.
Hit man: వాంఖడే స్టేడియంలో లంక టాస్ గెలిచి ఫీల్టిండ్ తీసుకుంది. టీమిండియా బ్యాటింగ్కు దిగింది. ఆ వెంటనే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. కెప్టెన్గా సమిష్టి నిర్ణయాలు తీసుకుంటానని తెలిపారు.
మైదానంలో పరిస్థితులను అంచనా వేస్తానని రోహిత్ (Rohit) చెప్పారు. ఆట ఏ వైపునకు మళ్లుతుందనే అంశం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. కొన్నిసార్లు ఫలితాలు అనుకూలంగా వస్తాయి.. మరికొన్ని సార్లు వికటిస్తాయని చెప్పారు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని డెసిషన్ తీసుకుంటానని చెప్పారు. ప్రత్యర్థి జట్టు బలాబలాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని అన్నారు.
అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని.. ఆ క్రెడిట్ జట్టు సభ్యులకే దక్కుతుందని చెప్పారు. పరిస్థితులు బాగా ఉన్నంత వరకు బానే ఉంటుంది. ఏ చిన్న తేడా వచ్చిన అంతే సంగతులు.. చెత్త కెప్టెన్ అంటారని పేర్కొన్నారు. ఆ అంశంపై తనకు అవగాహన ఉందని.. జట్టు ప్రయోజనాల కోసం కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటానని తెలిపారు.