టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా (Hardik Pandya) ఈ మెగా టోర్ని మొత్తానికి దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడ్డ హార్ధిక్ పాండ్యా న్యూజిలాండ్(New Zealand), ఇంగ్లండ్, శ్రీలంకపై ఆడలేదు. అతడు ఇంకా గాయం నుండి రికవరీ కాకపోవడంతో ఈ టోర్నీ మొత్తానికి దూరమాయ్యాడు.చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో పాండ్యా స్థానాన్ని బీసీసీఐ (BCCI) యువ పేసర్ ప్రసిద్ కృష్ణతో భర్తీ చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
కాగా ప్రపంచకప్(World Cup)-2023 లీగ్ దశలో భాగంగా పుణెలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. తన బౌలింగ్‌లో బంగ్లా బ్యాటర్ బాదిన షాట్‌ను అడ్డుకునే క్రమంలో పట్టుతప్పి కింద పడిన పాండ్యా కాలికి గాయమైంది. దీంతో అతడు ఓవర్ పూర్తి చేయకుండానే క్రీజును వీడగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(రైట్ఆర్మ్ పేసర్) పాండ్యా స్థానంలో బరిలోకి దిగాడు. అయితే, గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాండ్యా మళ్లీ బ్యాటింగ్‌కు కూడా రాలేదు.ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఊహించని రీతిలో కర్ణాటక పేసర్ ప్రసిద్ కృష్ణ(Prasid Krishna)ను అదృష్టం వరించింది. సొంతగడ్డ మీద తొలిసారి వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో భాగమయ్యే అవకాశం దక్కింది.