»Cm Kcr Offer Prayers To Koinapally Lord Venkateswara
KCR సెంటిమెంట్ కంటిన్యూ.. కోనాయిపల్లి వెంకటేశుడికి పూజలు
సెంటిమెంట్ దేవుడు కోనాయిపల్లిలో గల వెంకటేశ్వర స్వామి ఆలయానికి సీఎం కేసీఆర్ వస్తున్నారు. అక్కడ స్వామి వారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేయిస్తారు.
CM KCR Offer Prayers To Koinapally Lord Venkateswara
Koinapally Lord Venkateshwara Swamy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలైంది. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో తొలి నామినేషన్‌ను కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు నిన్న దాఖలు చేశారు. 9వ తేదీన సీఎం కేసీఆర్ (CM KCR) గజ్వేల్ ఆ తర్వాత కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు. నామపత్రాలు దాఖలు చేసేందుకు తన సెంటిమెంట్ దేవుడి ముందు పెట్టి పూజలు చేసే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలో (Koinapally) వేంకటేశ్వర స్వామి ఆలయం అంటే కేసీఆర్‌కు సెంటిమెంట్. ఇప్పుడే కాదు.. 1985 నుంచి ఆ సెంటిమెంట్ కొనసాగిస్తున్నారు. ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేస్తారు. తనకు విజయాన్ని ప్రసాదించాలని ఆ భగవండుని కోరుకుంటున్నారు. ఈ సారి గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలో కూడా కేసీఆర్ పోటీ చేస్తున్నారు. రెండు నామినేషన్ పత్రాలతో శనివారం ఉదయం ఆలయానికి కేసీఆర్ వస్తారు.
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గం ద్వారా కోనాయిపల్లికి చేరుకుంటారు. స్వామి వారి పాదాల వద్ద ఉంచి పూజలు చేస్తారు. తర్వాత 9వ తేదీన రెండు చోట్ల నామినేషన్ ఫైల్ చేస్తారు. 1985లో సిద్దిపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తొలిసారి నామపత్రాలకు పూజలు చేశారు. ఆ ఎన్నికల్లో గెలవడంతో.. తర్వాత జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇలానే పూజుల చేస్తున్నారు. ఇటీవల ఆలయం పునర్నిర్మాణం జరిగింది. ఆ తర్వాత తొలిసారి కేసీఆర్ ఆలయానికి వస్తున్నారు.