»25 Years Old Rachin Ravindra Break The Sachin Tendulkar Record
Rachin Ravindra: సచిన్ రికార్డును చిత్తు చేసిన 25 ఏళ్ల రచిన్ రవీంద్ర
వన్డే వరల్డ్ కప్ 2023లో నేడు న్యూజిలాండ్ యువ ఆటగాడు రచిన్ రవీంద్ర(Rachin Ravindra) సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన 35వ మ్యాచులో ఈ ఘనతను సాధించాడు. అయితే అతని వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
25 years old Rachin Ravindra break the Sachin tendulkar record
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో 35వ మ్యాచులో తాజాగా పాకిస్థాన్ జట్టుపై న్యూజిలాండ్ 401 పరుగులు చేసింది. ఈ క్రమంలో బ్యాట్స్‌మెన్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra) అద్భుత సెంచరీ సాధించాడు. రచిన్ రవీంద్ర 94 బంతుల్లో 108 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. ఈ ప్రపంచకప్‌లో రచిన్ రవీంద్ర మూడోసారి సెంచరీ మార్కును దాటాడు. ఈ నేపథ్యంలో రచిన్ రవీంద్ర వయసు 23 ఏళ్లు కాగా.. ఈ ఆటగాడు మూడోసారి ప్రపంచకప్ మ్యాచ్‌లో సెంచరీ సాధించి తన పేరిట ప్రత్యేక రికార్డు సృష్టించాడు.
23 ఏళ్ల వయసులో ప్రపంచకప్‌లో 3 సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మెన్ రచిన్ రవీంద్ర నిలిచాడు. గతంలో భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్(sachin tendulkar) 23 ఏళ్ల వయసులో 2 ప్రపంచకప్ సెంచరీలు నమోదు చేయగా, ఇప్పుడు రచిన్ రవీంద్ర సచిన్ టెండూల్కర్‌ను చిత్తు చిత్తు చేసేశాడు. ఇది కాకుండా రచిన్ రవీంద్ర మరో భారీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రచిన్ రవీంద్ర నిలిచాడు. ఇంతకు ముందు ప్రపంచకప్‌లో కివీస్‌లో ఏ బ్యాట్స్‌మెన్ కూడా మూడుసార్లు సెంచరీ చేయలేదు.
అదే సమయంలో ఈ ప్రపంచకప్‌లో రచిన్ రవీంద్ర(Rachin Ravindra) బ్యాట్(batting)తో నిప్పులు చేరిగారు. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో రచిన్ రవీంద్ర రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు రచిన్ రవీంద్ర 8 మ్యాచ్‌ల్లో 74.71 సగటుతో 523 పరుగులు చేశాడు. ఇది కాకుండా 3 మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించాడు. ఇంగ్లండ్‌పై రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 123 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియాపై రచిన్ రవీంద్ర 89 బంతుల్లో 116 పరుగులు చేశాడు. ఇప్పుడు పాకిస్థాన్‌పై 94 బంతుల్లో 108 పరుగులు చేశాడు.