»If Aussie Kiwis Won The Match 4 Teams Out To World Cup
Aussie, Kiwis: ఆ రెండు గెలిస్తే.. ఈ నాలుగు వరల్డ్ కప్ నుంచి ఔట్
ఆసీస్, కివీస్ మ్యాచ్లు గెలిస్తే.. ఆ రెండు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటాయి. టోర్నీ నుంచి పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ ఇంటికి వెళ్లిపోతాయి.
If Aussie, Kiwis Won The Match 4 Teams Out To World Cup
Aussie, Kiwis: వన్డే వరల్డ్ కప్లో లీగ్ దశ చివరికి వచ్చింది. ఈ రోజు రెండు మ్యాచ్లు ఉన్నాయి. వీటిలో ఆసీస్, కివీస్ గెలిస్తే చాలు.. నాలుగు జట్లు ఇంటి ముఖం పడతాయి. ఆ జట్లు ఏవో తెలుసుకుందాం. పదండి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. తర్వాత స్థానంలో ఉన్న సౌతాఫ్రికా కూడా సెమీస్ చేరింది. ఆ రెండు జట్లు 1,2 వ స్థానాల్లో ఉన్నాయి. మూడు, నాలుగు స్థానాల కోసం మిగతా జట్టు పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ రెండు గెలిస్తే.. ఆ జట్టు సెమీస్ చేరతాయి. ఆ జట్లలో ఏ ఒక్కటి ఓడిపోయినా సరే సెమీస్ అవకాశాలు సన్నిగిల్లుతాయి.
ఆస్ట్రేలియా (Aussie) 6 మ్యాచ్లు ఆడింది. అందులో 4 విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా ప్రత్యర్థి ఇంగ్లాండ్ ఆరు మ్యాచ్ల్లో 5 ఓడిపోయింది. దీంతో ఆ జట్టుకు సెమీస్ బెర్త్ కష్టమే. పరువు కోసం పోరాడే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ గెలిస్తే అంచనాలు తలకిందులు అవుతాయి. అదే ఆస్ట్రేలియా గెలిస్తే నేరుగా సెమీస్ చేరుతుంది. ఆ జట్టుకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గాయం వల్ల మ్యాక్స్ వెల్ దూరం కాగా.. వ్యక్తిగత కారణాలతో మిచెల్ మార్ష్ ఆడటం లేదు.
టోర్నీ స్టార్టింగ్లో 4 విజయాలు సాధించింది న్యూజిలాండ్ (Kiwis). తర్వాత వరసగా 3 మ్యాచ్ల్లో ఓడింది. విలియమ్ సన్ ఒక్క మ్యాచ్ ఆడగా.. పేసర్ హెన్రీ గాయంతో టోర్నీకి దూరం అయ్యాడు. 7 మ్యాచ్లు ఆడి 3 మాత్రమే పాకిస్థాన్ విజయం సాధించింది. ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే తాము కూడా రేసులో ఉన్నామని పాకిస్థాన్ అంటోంది. ఈ రోజు కివీస్ గెలిస్తే నేరుగా సెమీస్ చేరుతుంది. పాకిస్థాన్ గెలిస్తే అంచనాలు మారతాయి. ఆసీస్, కివీస్ గెలిస్తే ఆ రెండు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటాయి. దీంతో పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ జట్లు టోర్నీ నుంచి వెళ్లిపోతాయి. ఏం జరుగుతుందో చూడాలి మరీ.