Rajamouli: మ్యాక్స్ వెల్ రికార్డ్ కి రాజమౌళి క్రేజీ రియాక్షన్!
మాక్స్వెల్ ఇన్నింగ్స్‌పై టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. నిన్న అప్గానిస్తాన్‌పై ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్ అద్భుతంగా 201 రన్స్ చేశాడు. దీంతో తన ప్రదర్శనతో ప్రముఖ వ్యక్తుల నుంచి అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి.
వరల్డ్ కప్ లో మంగళవారం ఆప్గానిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య రసవత్తర పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్(Maxwell) అదరగొట్టాడు. మాక్స్వెల్ ఇన్నింగ్స్‌పై దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) షాకింగ్ కామెంట్స్ చేశారు. నిన్న, ఆఫ్ఘనిస్తాన్పై ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్ అద్భుతమైన ప్రదర్శన కనిపించాడు. ఆయన ఆట తీరుపై క్రికెట్ స్టార్లు, ఇతర ప్రముఖ వ్యక్తుల నుంచి అద్భుతమైన ప్రశంసలను అందుకున్నాడు. 292 పరుగుల సవాలు లక్ష్యం ఉన్నప్పటికీ, మ్యాక్స్‌వెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆటను మలుపు తిప్పి ఆస్ట్రేలియా జట్టును విజేత స్థానంలో నిలిపింది. రాజమౌళి మాక్స్వెల్ ఇన్నింగ్స్‌పై క్రేజీ కామెంట్ చేశాడు. మ్యాడ్, మ్యాక్స్ అంటూ ట్వీట్ చేశాడు.
ఈ మ్యాచ్ ముంబయి వాంఖెడే స్టేడియంలో జరిగింది. ఆప్గానిస్థాన్ తో పోరులో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్(afghanistan) మరో సంచలనం సాధించడం లాంఛనమేనని అందరూ భావించారు. అంతేకాదు అసలు ఆసీస్ ఆటగాళ్లే తమ జట్టు గెలుస్తుందని అనుకుని ఉండరు. కానీ గ్లెన్ మ్యాక్స్ వెల్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మ్యాక్స్ వెల్ ఇచ్చిన క్యాచ్ ను ముజీబ్ జారవిడవడం ఆప్గాన్ జట్టుకు టోర్నీలో సెమీస్ ఛాన్సును దూరం చేసింది. ఆ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన మ్యాక్స్ వెల్ ఆ తర్వాత ప్రళయకాల రుద్రుడిలా డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు.
ఆప్గాన్ బౌలింగ్ ను అలా ఇలా కొట్టలేదు. కొడితే బంతి స్టాండ్స్ లో పడాలి అన్నంత కసిగా కొట్టాడు. మ్యాక్స్ వెల్ విజృంభణతో 292 పరుగుల టార్గెట్ కూడా చూస్తుండగానే కరిగిపోయింది. ఈ డాషింగ్ బ్యాట్స్ మన్ 128 బంతుల్లోనే 201 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మ్యాక్స్ వెల్ స్కోరులో 21 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయంటే అతడి విధ్వంసం ఏ రీతిన సాగిందో అర్థం చేసుకోవచ్చు. మధ్యలో కాలి కండరాలు పట్టేసి నిలబడడానికే ఇబ్బంది పడిన మ్యాక్స్ వెల్ మొండిపట్టుదలతో ఇన్నింగ్స్ కొనసాగించి ఆసీస్ జట్టుకు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు. మ్యాక్సీ చలవతో ఆసీస్ ఈ మ్యాచ్ లో 46.5 ఓవర్లలో 7 వికెట్లకు 293 పరుగులు చేసి విజయభేరి మోగించింది. ఇక రాజమౌళి విషయానికి వస్తే, ఆయన రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ తో విజయం సాధించాడు. ఇప్పుడు, మహేష్ తో ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.