»Shock For Bangladesh Shakibs Absence From The World Cup
World Cup : బంగ్లాదేశ్‌కు షాక్..ప్రపంచకప్‌కు షకిబ్ దూరం
బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబల్ హసన్ ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ఎడమ చూపుడు వేలు విరగడంతో ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగే బంగ్లా చివరి మ్యాచ్‌కు షకిబ్ అందుబాటులో ఉండట్లేదు
బంగ్లాదేశ్ (Bangladesh) కెప్టెన్ షకిబల్ హసన్ ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ఎడమ చూపుడు వేలు విరగడంతో ఈ నెల 11న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌కి దూరమయ్యాడు. మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండట్లేదు. అతని స్థానంలో అనాముల్ హక్ బిజయ్‌కు జట్టులో చోటు దక్కింది. సోమవారం శ్రీలంకతో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా షకిబ్ వేలుకు గాయమైంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే షకిబల్ హసన్ (Shakibal Hasan) కు గాయమైనా.. వేలికి టేపు చుట్టుకుని, నొప్పి నివారణ మాత్రలు వేసుకుని బ్యాటింగ్ కొనసాగించాడు. మ్యాచ్ అనంతరం ఎక్స్‌రే తీయించగా వేలు విరిగినట్లు తేలింది. దీంతో శనివారం పుణె(Pune)లో ఆసీస్‌తో పోరుకు షకిబ్ దూరమయ్యాడు.
పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న బంగ్లాకు ప్రపంచకప్‌లో ఇదే చివరి మ్యాచ్. శ్రీలంక (Sri Lanka) మ్యాచ్‌లో మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. వికెట్ పడిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మాథ్యూస్(Mathews).. గార్డ్ తీసుకోకుండా హెల్మెట్ (కొత్త హెల్మెట్) కోసం వేచి చూశాడు. సమయం మించిపోవడంతో బంగ్లా కెప్టెన్ షకిబ్ హల్ హాసన్ ఔట్ కోసం అప్పీలు చేయగా.. అంపైర్లు అతడిని ఔట్‌గా ప్రకటించారు. క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడని షకిబ్‌పై విమర్శలు వస్తున్నాయి. వీటిపై షకిబ్ స్పందించాడు. టైమ్డ్ ఔట్ ఐసీసీ (ICC) నిబంధనల్లో ఉందని తెలిపాడు. వెంటనే నేను అప్పీల్ చేశా’ అని షకిబ్ తెలిపాడు.విజయం సాధించడంలో టైమ్డ్ ఔట్ ఉపయోగిపడిందని నేను అంగీకరిస్తా’ అని బంగ్లా కెప్టెన్ షకిబ్ చెప్పాడు.