AUS vs AFG: ఆప్ఘనిస్తాన్‌పై 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
292 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 91 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయింది. దీంతో విజయం ఆశలు ఆవిరయ్యాయి. అయితే గ్లెన్‌మాక్స్‌వెల్ విజృంభణతో ఆసీస్ విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది.
నేడు జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆఫ్ఘన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఇప్పటి వరకూ వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో ఆఫ్ఘన్ జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. ఆ తర్వాత 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 46.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసి విజయం సాధించింది.
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్‌మాక్స్‌వెల్ 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులు చేశాడు. ఒంటి చేత్తో ఆడి జట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు. ఆఫ్ఘన్‌తో మ్యాచ్ గెలిచిన సందర్భంగా ఆస్ట్రేలియా సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 24, డేవిడ్ వార్నర్ 18, లబుషేన్ 14 పరుగులు చేశారు. ఇకపోతే ఆఫ్ఘన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్ చెరొక రెండు వికెట్లను తీశారు.
Glenn Maxwell overcame adversities to smash a record double ton in an epic Australia win ⚡
ఆఫ్ఘన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ 129, రషీద్ ఖాన్ 35, రహ్మత్ షా 30, షాహిదీ 26, అజ్మతుల్లా 22 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్ 2 వికెట్లు పడగొట్టగా మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్వెల్, ఆడమ్ జంపా తలొక వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించడంతో సెమీ ఫైనల్‌కు చేరుకుంది.