»For The First Time In The History Of Cricket Out For Not Coming To The Crease On Time
Angelo Mathews: క్రికెట్ చరిత్రలోనే తొలిసారి..సమయానికి క్రీజులోకి రానందుకు ఔట్!
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి శ్రీలంక బ్యాటర్ 'టైమ్డ్ ఔట్' నిబంధన ప్రకారం ఔట్ అయ్యాడు. సమయానికి క్రీజులోకి వచ్చి ఆటను ఆడటంతో విఫలం కావడం వల్ల అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో ఇలాంటి ఔట్ మొదటిసారి నమోదు అయ్యింది.
వన్డే వరల్డ్ కప్ టోర్నీ (Odi World Cup-2023)లో నేడు బంగ్లాదేశ్ (Bangladesh), శ్రీలంక (SriLanka) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీ(Delhi)లో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఓ ఘట్టం చోటుచేసుకుంది. అనుకున్న సమయానికి క్రీజులోకి రానందుకు లంక బ్యాటర్ ఔట్ అయ్యాడు. ఇప్పటి వరకూ ఎన్నడూ జరగని విధంగా శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’ (Timed Out) నిబంధన ప్రకారం అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేపట్టింది.
Dramatic scenes in Delhi with Angelo Mathews becoming the first batter to be timed out in international cricket 👀
శ్రీలంక బ్యాటర్ సదీర సమరవిక్రమ నాలుగో వికెట్‌కు పెవిలియన్ దారి పట్టాడు. ఆ తర్వాత మరో బ్యాట్స్‌మెన్ ఏంజెలో మాథ్యూస్ సకాలంలో బ్యాటింగ్‌కు రావడంలో విఫలం అయ్యాడు. దీంతో అతడిని ‘టైమ్డ్ ఔట్’గా అంపైర్లు ప్రకటించారు. అయితే సమరవిక్రమ ఔట్ అయ్యాక వెంటనే మాథ్యూస్ మైదానంలోకి అడుగుపెట్టాడు. కానీ తన హెల్మెట్‌కు ఉన్న స్ట్రాప్ ఊడిపోయింది. ఈ క్రమంలో మరో హెల్మెట్ తెప్పించుకుంటుండగా సమయం వృథా అయ్యింది.
ఐసీసీ నిబంధనల (ICC Rules) ప్రకారంగా ఓ బ్యాట్స్‌మెన్ ఔట్ అయితే 3 నిమిషాల లోపు కొత్త బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చి ఆడాలి. అయితే వరల్డ్ కప్‌లో ఆ సమయం 2 నిమిషాలుగా ఉంది. దీంతో సమయం దాటిపోవడంతో బంగ్లాదేశ్ ఫీల్డర్లు అంపైర్‌కు అప్పీల్ చేశారు. దీంతో అంపైర్లు మాథ్యూస్‌ను ‘టైమ్డ్ ఔట్’ కింద ఔట్ అయినట్లు ప్రకటించారు. ఒక్కబంతిని కూడా ఆడకుండానే ఔట్ అయిన బ్యాట్స్‌మెన్‌గా ఏంజెలో మాథ్యూస్ రికార్డుల్లోకి ఎక్కాడు. క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి ఔట్ తొలిసారి నమోదు కావడం విశేషం.