వరల్డ్‌కప్(World Cup)లో భారత్ చేతిలో 302 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిన శ్రీలంక టీమ్‌పై ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న క్రికెట్ బోర్డు(Cricket Board)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ కెప్టన్ అర్జున రణతుంగ (Arjuna Ranatunga) చేస్తున్నట్లు కమీటిని నియమిస్తున్నట్లు వెల్లడించింది. బోర్ఢులోని సభ్యులకు పదవిలో ఉండే హక్కులేదు. అవినీతి పెరిగిపోయింది. అందుకే బోర్ఢును తొలిగించాం అని క్రీడా మంత్రి రణసింఘే (Minister Ranasinghe) తెలిపారు. ప్రస్తుతానికి మధ్యంతర బోర్డును ఏర్పాటు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.1996 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు నేతృత్వం వహించిన అర్జున రణతుంగను ఈ కమిటీకి చైర్మన్ గా నియమించారు.
ఈ ప్యానెల్ లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, క్రికెట్ బోర్డు మాజీ ప్రెసిడెంట్ సహా ఏడుగురు సభ్యులను నియమించారు. ఇండియా(India)తో జరిగిన మ్యాచ్ లో ఘోర వైఫల్యం తర్వాత మంత్రి రోషన్ రణసింఘె క్రికెట్ బోర్డుపై మండిపడ్డారు.ఘోర ఓటములతో బోర్డుపై విమర్శలు రావడంతో కార్యాలయంపై దాడి జరిగే అవకాశం ఉందని భావించిన కొలంబో పోలీసు యంత్రాంగం బందోబస్తు ఏర్పాటు చేసింది. ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 358 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక (Sri Lanka)ఘోరంగా విఫలమైంది. టీమ్ఇండియా బౌలర్ల దెబ్బకు కేవలం 55 పరుగులకే కుప్పకూలింది