Team India టాస్ గెలిస్తే ఏం చేయాలంటే.. సన్నీ సజెషన్
టీమిండియా టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవడం బెటర్ అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సజెస్ట్ చేశాడు. తొలుత బ్యాటింగ్ చేస్తే భారీగా పరుగులు చేస్తే.. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టొచ్చని సన్నీ చెబుతున్నాడు.
Team India: మరికొన్ని గంటల్లో న్యూజిలాండ్‌తో టీమిండియా (Team India) సెమీస్ మ్యాచ్ ఆడనుంది. వరల్డ్ కప్ సీజన్లో రోహిత్ సేన ఆధిపత్యానికి తిరుగు లేకుండా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉంది. వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరగనుండటంతో కెప్టెన్ రోహిత్ శర్మ సొంత స్టేడియంలో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయే అవకాశం ఉంది. హిట్ మ్యాన్‌తోపాటు శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్ కూడా హోం గ్రౌండ్ అన్న సంగతి తెలిసిందే. సీజన్లో అయ్యర్ ఆడినప్పటికీ.. స్కై ఇప్పటివరకు మంచి ఇన్నింగ్స్ ఆడలేదు.
సెమీస్ ఫైనల్లో టీమిండియా టాస్ గెలిస్తే ఏం చేయాలనే అంశంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (sunil gavaskar) సజెషన్ ఇచ్చారు. బ్యాటింగ్ చేస్తే బెటర్ అని అభిప్రాయ పడ్డారు. బౌలర్లు చక్కగా రాణిస్తోండటంతో 400 రన్స్ కాకున్నప్పటికీ.. 260 నుంచి 270 పరుగులు చేసిన ఫర్లేదని అంటున్నారు. సాయంత్రం పూట తేమ ప్రభావం ఒక్కోసారి కలిసి వచ్చే అవకాశం ఉందన్నారు. స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ కూడా బంతి స్కిడ్ కాకుండా బౌలింగ్ చేయగలడని సూచించారు.
ఒకవేళ టాస్ ఓడినప్పటికీ ముందు బౌలింగ్ చేసిన ఫర్లేదని సన్నీ అంటున్నారు. ఎందుకంటే ముగ్గురు సీమర్లు మంచి ఫామ్‌లో ఉండటం.. స్పిన్నర్లు వారికి సహకరించడం అని చెబుతున్నారు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన బ్యాట్స్ మెన్ రెచ్చిపోయి ఆడుతున్నారని.. లక్ష్యాన్ని ఈజీగా కొడతారని అంచనా వేశారు. రోహిత్ శర్మ ఫామ్‌లో ఉన్నాడని.. చక్కగా ఆడుతున్నారని చెప్పారు. తొలి 10 ఓవర్లలో రావాల్సిన పరుగులు పిండుకుంటున్నారని.. దీంతో తర్వాత వచ్చే బ్యాట్స్ మెన్‌పై ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. సెమీస్‌లో టీమిండియానే ఫేవరేట్ అని.. ఈ సారి కచ్చితంగా కప్ కొడుతుందని ధీమాతో ఉన్నారు.
సెమీస్ మ్యాచ్‌కు బెదిరింపు వచ్చింది. మ్యాచ్ జరిగే సమయంలో దారుణ ఘటన జరుగుతుందని ఓ ఆగంతకుడు ట్వీట్ చేశాడు. తుపాకీ, హ్యాండ్ గ్రనేడ్, బుల్లెట్ ఉన్న ఫోటోను షేర్ చేశాడు. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు. స్టేడియం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.