వన్డేల్లో 50 సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ ఘనత సాధించడం పట్ల సచిన్ టెండూల్కర్ స్పందించారు. ఈ నేపథ్యంలో కోహ్లీతో తనకు జరిగిన మొదటి భేటీని గుర్తు చేసుకున్నారు. ఇంకా ఏం అన్నారో ఇప్పుడు చుద్దాం.
Sachin tendulkar and Anand Mahindra reacts on Virat 50th odi century
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 నేటి తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తో సంచలనం సృష్టించాడు. న్యూజిలాండ్‌పై సెంచరీ ఆడి, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్(Sachin tendulkar) సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేస్తూ కోహ్లీతో తన తొలి భేటీని గుర్తు చేసుకున్నాడు. సచిన్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చాడు. ‘నేను మిమ్మల్ని మొదటిసారి భారత డ్రెస్సింగ్ రూమ్‌లో కలిసినప్పుడు, మీ తోటి ఆటగాళ్ళు నా పాదాలను తాకడం గురించి జోక్ చేసారు. ఆ రోజు నేను నవ్వు ఆపుకోలేకపోయాను. కానీ త్వరలోనే మీరు మీ అభిరుచి, నైపుణ్యాలతో నా హృదయాన్ని తాకారు. ఓ యువ ఆటగాడు ‘విరాట్’ ప్లేయర్‌గా మారినందుకు చాలా సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అంతేాకాదు ఒక భారతీయుడు తన రికార్డును బద్దలు కొట్టినందుకు అంతకంటే సంతోషించలేను అని సచిన్ అన్నారు. అలాగే, ఇంత పెద్ద వేదికపై, ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌లో సొంతగడ్డపై ఇలా చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
The first time I met you in the Indian dressing room, you were pranked by other teammates into touching my feet. I couldn’t stop laughing that day. But soon, you touched my heart with your passion and skill. I am so happy that that young boy has grown into a ‘Virat’ player.
ఇక విరాట్ కోహ్లీ 113 బంతుల్లో 117 పరుగులు చేసి, అత్యధిక వన్డే సెంచరీలు చేసిన దిగ్గజం సచిన్ టెండూల్కర్ చరిత్రను బద్దలు కొట్టాడు. సచిన్ తన కెరీర్లో 463 ODIలు ఆడాడు. అందులో అతను 44.83 సగటుతో 452 ఇన్నింగ్స్‌లలో 18,426 పరుగులు చేశాడు. వన్డేల్లో మొత్తం 49 సెంచరీలు చేశాడు. మరోవైపు తన కెరీర్లో 279వ వన్డే ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించడం విశేషం. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు, 9 ఫోర్లు బాదాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 103.53. ఈ ఇన్నింగ్స్‌తో ఒకే ప్రపంచకప్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ రికార్డును కూడా కోహ్లీ బద్దలు కొట్టాడు. 2003 ప్రపంచకప్‌లో సచిన్ 673 పరుగులు చేశాడు. కాగా, కోహ్లి ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌ల్లో 711 పరుగులు చేశాడు.
-విరాట్ కోహ్లీ – 279 ఇన్నింగ్స్‌లు – 50 సెంచరీలు
-సచిన్ టెండూల్కర్ – 452 ఇన్నింగ్స్‌లు – 49 సెంచరీలు
-రోహిత్ శర్మ – 261 ఇన్నింగ్స్‌లు – 31 సెంచరీలు
-రికీ పాంటింగ్ – 365 ఇన్నింగ్స్‌లు – 30 సెంచరీలు
-సనత్ జయసూర్య – 433 ఇన్నింగ్స్‌లు – 28 సెంచరీలు
మరోవైపు కోహ్లీ ఈ ఘనత సాధించడం పట్ల ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) కూడా స్పందించారు. కోహ్లి వన్డేల్లో 50వ సెంచరీ సాధించి మరో లెజెండ్ రికార్డును అధిగమించాడని పేర్కొన్నారు. ఒక ఫైటర్ ప్లేన్ ల్యాండింగ్‌ను కలిగి ఉన్న వీడియోను షేర్ చేస్తూ ఈ ల్యాండింగ్ వలె ఖచ్చితమైనదిగా ల్యాండ్ చేసినందుకు ఉత్సాహంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తనతోపాటు ఇతర క్రీడాకారులు, ఫ్యాన్స్ సహా అనేక మంది కోహ్లీకి అభినందనలు తెలియజేస్తున్నారు.
Kohli getting to his 50th ODI ton, surpassing another legend’s record. As smooth, flawless & precise as this landing… We stand & cheer. 👏🏽👏🏽👏🏽🇮🇳 pic.twitter.com/XFM3p9rpiT