Team India ఎందుకు గెలుస్తుందంటే.. ద్రావిడ్ చెప్పిన కారణమిదే..?
వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్రకు గల కారణం సమిష్టిగా ఆడటమేనని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తెలిపారు. ఓ టాస్క్ పెట్టుకుని, టీమ్‌గా ఆడుతున్నారని.. అందుకే విజయాలు సాధిస్తున్నారని వివరించారు.
Team India: వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా విజయ పరంపర కంటిన్యూ అవుతోంది. లీగ్ దశలో అన్నీ మ్యాచ్‌ల్లో బంఫర్ విక్టరీ కొట్టి మాంచి జోష్ మీద ఉంది. రేపు న్యూజిలాండ్‌తో సెమీస్‌లో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో నెగ్గి.. ఫైనల్లో గెలిచి.. కప్ కొడుతోందని యావత్ భారత్ (india) కోరుకుంటుంది. ఈ ప్రపంచ కప్‌లో టీమిండియా (Team India) జైత్రయాత్రకు గల కారణాలను హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వివరించారు. ఆయన ఏమన్నారంటే..?
టీమ్ ఓ టాస్క్ పెట్టుకుందని ద్రావిడ్ అంటున్నారు. వారికి ఓ మిషన్ ఇచ్చానని వివరించారు. 9 నగరాల్లో జరిగిన మ్యాచ్‌లలో అభిమానుల నుంచి విశేషమైన మద్దతు లభించిందని చెబుతున్నారు. వీలైనంత బాగా ఆడాలని కోరుకున్నాం.. మంచి ప్రదర్శన ఇచ్చేందుకు కష్టపడ్డం.. కుర్రాళ్లు బాగా ఆడారని వివరించారు. సెమీస్‌కు ముందు ఆరు రోజుల విశ్రాంతి లభించింది.. ఇది తమకు బాగా కలిసి వస్తోందని చెప్పారు.
టీమ్‌లో ఐదుగురు బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఆడుతున్నారు.. ఇద్దరు, ముగ్గురు సెంచరీలు చేసి అదరగొడుతున్నారని చెప్పారు. బంతితో చేసిన ప్రయోగాలు కలిసి వచ్చాయని వివరించారు. మిడిలార్డర్ అద్భుతంగా రాణిస్తోందని పేర్కొన్నారు. టాప్ ఆర్డర్ పరుగుల వర్షం కురిపిస్తోందని అన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేంకగా ప్రశంసించారు. ఇలా అంతా కలిసికట్టుగా ఆడటంతో టీమ్ విజయాలు కొనసాగుతున్నాయని.. అవి కంటిన్యూ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.