»It Has Been 15 Years Since Virat Kohli Entered Cricket
Virat Kohli: క్రికెట్లోకి అడుగిడి 15 ఏళ్లు.. కింగ్ కోహ్లీ ప్రస్థానం
సచిన్ రికార్డులను ఎవరూ టచ్ చేయలేరనుకుంటే.. అద్భుతమైన ఆటతో విరాట్ కోహ్లీ ఆ దిశగా కొనసాగుతున్నాడు. కొన్ని రికార్డుల్లో సచిన్‌ను విరాట్ అధిగమించే అవకాశాలు ఉన్నాయి.
It has been 15 years since Virat Kohli entered cricket
Virat Kohli: భారత క్రికెట్ (Cricket) చరిత్రలో విరాట్ కోహ్లీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. క్రికెట్ దేవుడు సచిన్ (Sachin)కు ఉన్న ఫాలొయింగ్ ఉంది. కింగ్ కోహ్లీ క్రికెట్లోకి అడుగుపెట్టి 15 ఏళ్లు అవుతోంది. దీంతో సోషల్ మీడియాలో కింగ్ కోహ్లీ ట్రెండ్ అవుతున్నారు. 16 ఏళ్లకే క్రికెట్లోకి అడుగుపెట్టి.. అంచలంచెలుగా ఎదిగి.. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) వందకు పైగా మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ అవతరించాడు. ఇప్పటి వరకు 111 టెస్టులు, 275 వన్డేలు, 115 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
సచిన్ రికార్డులను ఎవరూ టచ్ చేయలేరు అనుకుంటే విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికీ కొన్ని రికార్డుల్లో సచిన్‌ను విరాట్ అధిగమించే అవకాశాలు ఉన్నాయి. వన్డేల్లో సచిన్ 49 సెంచరీలు చేయగా.. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 46తో కొనసాగుతున్నాడు. అద్భుమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించి జట్టును గెలిపించాలనేది అభిమానుల కోరుకుంటున్నారు. కెరీర్లో అన్ని ఫార్మాట్లలో 9వేల పరుగుల చేశాడు. ప్రస్తుతం 25,582 పరుగుల చేసి 50 సగటుతో కొనసాగుతున్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ కావడం విశేషం.
క్రికెటర్‌గా మైదానంలో చాలా యాక్టివ్‌గా ఉండాలి. దాని కోసం ఎప్పుడూ ఫిట్‌గా ఉంటేనే అనుకున్న ఫలితాలు సాధించేందుకు ఆస్కారం ఉంటుంది. విరాట్ అందులో మాస్టర్ అని చెప్పవచ్చు. ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లలేదంటే ఫిట్నెస్, ఆరోగ్యం విషయంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) తీసుకునే జాగ్రత్తలు ఏంటో తెలిసిపోతుంది. కచ్చితమైన డైట్ పాటిస్తారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా జిమ్‌లో గడుపుతున్న ఫొటోలను చూస్తూనే ఉన్నాం కదా. గాయాలు, ఫిట్నెస్ కారణంగా అతడు జట్టుకు దూరమైన సందర్భాలు లేవనే చెప్పాలి. ప్రస్తుతం కొహ్లీ వయసు 34 ఏళ్లు. ఎంతలేదన్నా ఇంకో నాలుగు సంవత్సరాలు ఆడుతారు. మరి ఈ సమయంలో ఇంకెన్ని రికార్డులను సాధిస్తారో చూడాలి.