»A Woman Unexpected Shopping At Ikea Hyderabad Store
Sameera: ల్యాంప్ కోసం ఐకియా వెళ్లి, ఇంత షాపింగా..?
సమీర అనే అమ్మాయి హైదరాబాద్ ఐకియాలో షాపింగ్ చేసింది. ల్యాంప్ తీసుకుందాం అని వెళ్లి.. ఇతర వస్తువులు కొనుగోలు చేసింది. ఆమె కొన్న షాపింగ్ బిల్ చాంతాడంత అయ్యింది.
A Woman Unexpected Shopping At IKEA Hyderabad Store
Unexpected Shopping At IKEA: మహిళల (women) షాపింగ్ అంటే మాములుగా ఉండదు. అవును ఏదో కొందాం అనుకుంటారు. ఏదేదో తీసుకుంటారు. అసలు కొనాల్సిన వస్తువు తీసుకోరు. ఇలాంటి అనుభవం చాలామంది ఎదుర్కొన్నారు. అలా హైదరాబాద్కు (hyderabad) చెందిన ఓ మహిళా (women) కూడా షాపింగ్ చేసింది. ల్యాంప్ (lamp) కొందాం అని హైదరాబాద్ ఐకియాకు (ikea) వెళ్లింది. కొనాల్సిన వస్తువులు కాకుండా.. మిగతా ఐటెమ్స్ (items) తీసుకుంది. అలా బిల్ కూడా చాంతాడంత అయ్యింది. కానీ తీసుకోవాల్సిన ఆ ల్యాంపే తీసుకోకపోవడం విశేషం.
సమీర (sameera) అనే మహిళ ల్యాంప్ (lamp) కొనాలని అనుకుంది. ఐకియా (ikea) డిఫరెంట్ స్టైల్ మాడల్స్ ఉంటాయి. సో.. అక్కడైతే బెటర్ అనుకుని వెళ్లింది. ఐకియాకు (ikea) వచ్చిన తర్వాత ఆమె ఆలోచన తీరు మారింది. మిగతా ఐటెమ్స్ (items), హోమ్ నీడ్స్ (home needs), ఫ్లవర్స్ (flowers), కర్టైన్స్ (curtains), టేబుల్స్ (tables) చూసి తీసుకోవాల్సిన ఐటెమ్ మరిచింది. బిల్లు మాత్రం తడిసి మోపెడు అయ్యింది. ఎంతలా అంటే ఆమె హైట్ కన్నా ఎక్కువగా ఉంది. తాను కొన్ని వస్తువులు చూసి.. ఆమెనే ఆశ్చర్యపోయింది. తాను ఇంత షాపింగ్ చేశానా..? అని సందేహా పడింది.
సరేలే అనుకొని.. బిల్లింగ్ కౌంటర్ వద్ద ఓ ఫోటో దిగింది. ఆ ఫోటోను (photo) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఈ నెల 10వ తేదీన ఫోటో పోస్ట్ చేయగా.. ఇప్పటివరకు 2.38 లక్షల మంది చూశారు. ఇక కామెంట్లతో ఆ సెక్షన్ నిండిపోయింది. మరోసారి ఐకియాకు (ikea) వెళ్లాలంటే భయమేస్తోందని ఒకరు.. ఐకియాలో కొనుగోలు చేసిన ఓ ల్యాంప్ తన వద్ద ఉందని.. 50 శాతం డిస్కౌంట్తో మీరు కొనాలని మరొకరు రాశారు. అదేంటి మీరు ల్యాంప్ కొనడం మరచిపోయారా… మళ్లీ తీసుకునేందుకు వెళతారా ఏంటని ఇంకొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సో.. సమీర చేసిన షాపింగ్ బిల్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అసలు ఆమె అనుకుంది ఏంటీ.. చేసిన షాపింగ్ ఏంటీ అనే డిస్కషన్ జరుగుతోంది.