»Junior Ntr Six Pack Body For Prashanth Neel Movie
Junior NTR: ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీ..ఆ సినిమా కోసమేనా?
ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్(junior NTR). ఈ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు. అందుకోసం.. సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడట తారక్. అయితే యంగ్ టైగర్ బాడీ బిల్డింగ్ ఏ సినిమా కోసమనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.
ప్రస్తుతం దేవర సెట్స్ పై ఉంది. ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టనున్నాడు తారక్(junior NTR). ఆ పైన ప్రశాంత్ నీల్(prashanth neel)తో హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ చేయనున్నాడు. దీంతో ఎన్టీఆర్ కండలు పెంచేందుకు రెడీ అవుతన్నాడట. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 5 టార్గెట్‌గా దేవర సినిమా షూటింగ్ జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్ వరకు కంప్లీట్ చేసి.. ఆ తర్వాత వార్ 2(war 2)లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్(junior NTR). అయితే ఇంకా దేవర షూటింగ్ కంప్లీట్ అవనే లేదు.. అప్పుడే వార్ 2 కోసం టైగర్ కండలు పెంచబోతున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది.
బాడీ బిల్డప్ కోసం దుబాయ్ లేదా అమెరికా వెళ్లనున్నాడట ఎన్టీఆర్(NTR). వార్ 2లో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు తారక్. ఈ భారీ ప్రాజెక్ట్‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేయబోతున్నాడు. హృతిక్ రోషన్ లాంటి హల్క్‌తో తారక్ ఫైట్ చేయాలంటే భారీగా బాడీ బిల్డప్ చేయాల్సిందే. అందుకే ఇప్పటి నుంచే ఆ పాత్ర కోసం తారక్ కండలు పెంచబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో.. అరవింద సమేత తర్వాత యంగ్ టైగర్ సిక్స్ ప్యాక్‌ను మరోసారి వార్ 2లో చూడొచ్చు. అయితే మరో వెర్షన్ ప్రకారం..ఎన్టీఆర్ బాడీ బిల్డింగ్ దేవర కోసమనే అనే టాక్ కూడా నడుస్తోంది. ఇందులో తారక్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడని..అందులో ఒకటి భారీగా ఉంటుందనే టాక్ ఉంది. ఇక ఎలాగు నెక్ట్స్ వార్2 కూడా ఉంది కాబట్టి.. త్వరలోనే సిక్స్ ప్యాక్(six pack) కోసం రంగంలోకి దిగనున్నాడట తారక్. మరి దేవర, వార్2తో యంగ్ టైగర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.