భారత్ – న్యూజిలాండ్ ల మధ్య టీ20 సిరీస్ లో భాగంగా నేడు ఆఖరి మూడో టీ20 మ్యాచ్ అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియం వేదికగా జరుగనుంది. తొలి మ్యాచ్ లో కివీస్, రెండో మ్యాచ్ లో భారత్ గెలవటంతో ఇది సిరీస్ డిసైడర్ గా మారింది. సిరిస్ ను నిర్ణయించే మ్యాచ్ కాబట్టి రసవత్తర పోరు ఖాయం. ఈ టీ20 సిరీస్ లో భారత టాపార్డర్ బ్యాటర్లు ఇప్పటివరుకు రాణించలేదు.. ఓపెనర్లు శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, వన్ డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి లు ఆకట్టుకోలేకపోయారు. గిల్ వన్డే సిరీస్ ఫాంను కొనసాగించలేకపోతున్నాడు. ఇషాన్ కిషన్ అస్సలు టచ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. ఇక కోహ్లీ స్థానంలో బరిలోకి దిగుతున్న రాహుల్ త్రిపాఠి అంచనాలకు అందుకోలేదు. ఈ మ్యాచ్ లో వీరు ముగ్గురూ రాణించాల్సిందే. స్పిన్ కు విపరీతంగా సహకరించిన రెండో మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యలు నిదానంగానే ఆడినప్పటికీ చివరి వరకు నిలబడి జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్ లోనూ వారు అదే ప్రదర్శనను పునరావృతం చేయాల్సి ఉంది.