వృద్ధిమాన్ సాహా, శుబ్ మన్ గిల్ సౌజన్యంతో నిన్న గుజరాత్ టైటాన్స్ PBKSని ఓడించింది. కానీ హార్దిక్ పాండ్యా(hardik pandya) అభిమానులు మాత్రం పాండ్యా ప్రదర్శన చెత్తగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. వరుసగా అనేక మ్యాచుల్లో విఫలమవడంతో సోషల్ మీడియాలో ఆయనను పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.
ఐపీఎల్ 2023లో గురువారం గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ గెలిచింది. అయితే… గెలిచినా కూడా.. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya)ని ఫ్యాన్స్ ఏకిపారేస్తుండటం గమనార్హం. గతేడాది సీజన్లో అద్భుతంగా రాణించిన పాండ్యా..ఈ సీజన్ లో మాత్రం బ్యాటింగ్, బౌలింగ్ లో దారుణంగా విఫలమవుతున్నాడు.
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పాండ్యా..11 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్ లో మూడు మ్యాచ్ లు ఆడిన అతడు 21 పరుగులు మాత్రమే చేశాడు.
ఇంత దారుణ ప్రదర్శన కనబరుస్తున్న హార్ధిక్(Hardik Pandya)ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అదృష్టం బాగుంది కాబట్టి గెలుస్తున్నావు. నీ చెత్త బ్యాటింగ్ తో కాదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరి కొంత మంది కెప్టెన్ గా ఇదేనా నీ ఆట? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.