ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)పై ఆ ఐదు సిక్స్‌లు తన జీవితాన్ని మార్చేశాయని టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ తెలిపారు. ఐర్లాండ్(Ireland)తో రెండో టీ20) రింకూ తన సత్తా చాటాడు. మొదటి 15 బంతుల్లో 15 పరుగులే చేసిన అతడు.. చివరి రెండు ఓవర్లలో గేర్లు మార్చి జట్టుకు భారీ స్కోరునందించాడు. మొత్తం 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 38 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం రింకూ సింగ్(Rinku Singh)ను భారత స్పిన్నర్ రవిబిష్ణోయ్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా ను భారత స్పిన్నర్ రవిబిష్ణోయ్ ఇంటర్వ్యూ చేశాడు. రెండో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందన్నారు.
ఐపీఎల్(IPL)లో ఆడినట్లుగానే చివరి వరకు ఆడాలని అనుకున్నాను. ప్రశాంతంగా ఉంటూ చివరి 2-3 ఓవర్లు హిట్టింగ్ చేయాలని ప్రణాళిక వేసుకున్నా. ఐదు సిక్సర్లు (ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌పై) నా జీవితాన్ని మార్చేశాయి. ఆ ఇన్నింగ్స్ నుంచే నాకు గుర్తింపు వచ్చింది. అభిమానులు స్టాండ్స్ నుంచి ‘రింకూ.. రింకూ’ అని ఉత్సాహపరచడాన్ని ఇష్టపడతా’’ అని రింకూ సింగ్ ఆ వీడియోలో వివరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ (BCCI)తాజాగా తన ట్విటర్ (X) ఖాతాలో పోస్టు చేసింది.2023 ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది జట్టును గెలిపించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
తర్వాతి మ్యాచ్‌ల్లో కూడా రింకూ దూకుడు కొనసాగింది. తద్వారా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్(Ireland)తో మూడో టీ20 బుధవారం జరగనుంది. మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.10 ఏళ్లుగా కష్టపడుతున్నా, నా ప్రయత్నాలు ఫలించాయి. తొలి గేమ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నా, ఇంతకంటే ఆనందం ఏం ఉంటుంది.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, ఐర్లాండ్‌తో తొలి టీ20లో రింకుకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రెండో టీ20లో వచ్చిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకుంటూ ఐపీఎల్ (IPL) ఫామ్‌ను కొనసాగించాడు.