నేడు కివీస్ తో టీమిండియా తలపడనుంది. తొలి వన్డే మ్యాచ్ లో భాగంగా టీమిండియా టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. దాదాపుగా నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో వన్డే క్రికెట్ మ్యాచ్ జరగడం విశేషం. హైదరాబాద్ పేసర్ అయిన మహమ్మద్ సిరాజ్ కు సొంతగడ్డపై ఇది తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ కావడంతో అందరి చూపు అతనివైపే ఉంది. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేయనుండగా శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా సిరీస్ కు దూరమయ్యాడు. హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతుండటం వల్ల క్రికెట్ అసోసియేషన్ పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. దాదాపు 2,500 మంది పోలీసులతో నిఘా ఉంచారు. మహిళల కోసం 40 మందితో షీ టీమ్ లను కూడా ఏర్పాటు చేశారు.