»David Warner Pat Cummins Funny Comments On Threads App Rishabh Pant Also Made Comments On Them
David Warner: థ్రెడ్స్ యాప్ లోకి వార్నర్… పాట్ కమ్మిన్స్ ఫన్ని కామెంట్స్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ థ్రెడ్స్ యాప్ లో క్రికెటర్ పాట్ కమ్మిన్స్ ను ట్యాగ్ చేస్తూ నేను కొత్త యాప్ లోకి వచ్చాను అని రాసుకొచ్చారు. దీనికి బదులుగా వీడియోలు మాత్రం పెట్టకు అని కమ్మిన్స్ కామెంట్ చేశాడు.
David Warner...Pat Cummins funny comments on threads app...Rishabh Pant also made comments on them
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ్ సంస్థ మెటా గ్రూప్ నుంచి థ్రెడ్(Threads) అనే మరో అన్ లైవ్ చాాటింగ్ యాప్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదలైన కొద్ది రోజుల్లోనే విశేష ఆదారణను సొంత చేసుకున్న ఈ యాప్ ట్విట్టర్ కు గట్టి పోటీనిస్తోంది. ప్రస్తుతం టాప్ సెలబ్రెటీలు సైతం ఈ యాప్ లోని వాడుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ స్టార్ క్రికెటర్ డెవిడ్ వార్నర్(David Warner) థ్రెడ్స్ యాప్ లో అకౌంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెటర్ పాట్ కమ్మిన్స్(Pat Cummins) ను ట్యాగ్ చేస్తూ ‘హే ఐ యామ్ నౌ ఇన్ థ్రెడ్స్’ అంటూ పోస్ట్ చేశాడు. దీనికి బదులుగా కమ్మిన్స్ వీడియోలు మాత్రం పెట్టకు ప్లీజ్ అంటూ రిప్లై ఇచ్చారు. వీరి చాటింగ్ కు రిప్లై గా ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్(Rishabh Pant) ఇది బెస్ట్ అడ్వైజర్ బ్రో అంటూ కమ్మిన్స్ కు వంత పాడుతూ నవ్వుతున్న రెండు ఇమేజ్ లతో కామెంట్ చేశారు. అయితే డెవిడ్ వార్నర్ తన ఇన్ స్టాగ్రామ్ లో గత కొన్నాళ్లుగా రీల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో అల్లు అర్జున్ పుష్ప సినిమా నుంచి తగ్గేదే లే అనే డైలాగ్ చెప్పారు. అది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ప్రస్తుతం వీరి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక ట్విట్టర్ కు పోటీగా ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ థ్రెడ్స్ అనే యాప్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ట్విట్టర్ సంస్థ అసహనం వ్యక్తపరుస్తూ ఈ కొత్త యాప్ ను తమ ట్విట్టర్ టెక్నాలజీని కాపీ చేసి తయారు చేసినట్లు ఆరోపణలు చేసింది. ప్రస్తుతం మార్కెట్ లో థ్రెడ్స్ యాప్ హవా కొనసాగుతుండగా.. దీనిలో కొన్ని లోపాలు ఉన్నట్లు యూజర్లు అభిప్రాయపడుతున్నారు.