»David Warner Has Announced His Retirement From Test Cricket Tears After The Last Match
David Warner: వార్నర్ వీడ్కోలు.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ తన కెరియర్లో చివరి టెస్ట్ ఆడేశాడు. గెలుపుతోనే ఆటను విరమించాలనే తన కోరిక నెరవేరినందుకు సంతోషపడ్డాడు. ఆయన రిటైర్మెంట్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు.
David Warner has announced his retirement from Test cricket. Tears after the last match
David Warner: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) తన చివరి టెస్టు ఆడేశాడు. టెస్టులకు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ నేటితో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన టెస్ట్‌లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో నెగ్గడంతో వార్నర్ సంతోషం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కెరియర్లో ఎదుర్కొన్న ఒడిదుడుకులను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టుకున్నాడు. ఇక చివరి టెస్ట్‌లో గెలవడం తన కల అని చెప్పుకొచ్చారు. దిగ్గజ ఆటగాళ్లతో ఆస్ట్రేలియా జట్టు తరఫున ఆడడం తన అదృష్టమని వార్నర్ తెలిపాడు.
ఆస్ట్రేలియ అద్భుతమైన ప్రదర్శన చేస్తుందని, ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ గెలవడం, యాషెస్ సిరీస్ ను డ్రా చేసుకోవడం, ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్ కప్ ను కైవసం చేసుకోవడం తను ఎప్పుడు మరిచిపోని జ్ఙాపకం అని తెలిపాడు. 37 ఏళ్ల వార్నర్ తన సుదీర్ఘ టెస్టు కెరీర్ లో 112 మ్యాచ్ లు ఆడి 44.59 సగటుతో 8,786 పరుగులు చేశాడు. అందులో 26 సెంచరీలు, 37 అర్ధసెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో వార్నర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 335 పరుగులు. ఐపీఎల్ ద్వారా తెలుగువాళ్లకు చాలా దగ్గరయ్యారు. అంతే కాకుండా తెలుగు సినిమాలపై తనదైన శైలీలో టిక్ టాక్ చేస్తూ ప్రేక్షకులను అలరించారు.