Australian cricketer David Warner has a rare record
David Warner: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపనర్ డేవిడ్ వార్నర్ మరో అరుదైన రికార్డు సృష్టించాడు. క్రికెట్లోని మూడు ఫార్మెట్లలో 100కు పైగా మ్యాచులు ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇటీవలే వెస్టిండీస్‌తో వార్నర్ తన 100వ టీ20 మ్యాచ్‌ను ఆడాడు. దీంతో ఆస్ట్రేలియా తరపున 100 టీ20 మ్యాచులు ఆడిన మూడో ఆటగాడుగా నిలిచారు. వార్నర్ ఇప్పటి వరకు 112 టెస్టులు, 161 వన్డేలు, 100 టీ20లు ఆడాడు. ఈయన కన్న ముందు స్థానంలో ఉన్న ఆరోన్ ఫించ్ 103 టీ20లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తరువాత గ్లెన్ మ్యాక్స్‌వెల్ (101)తో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం మాథ్యూ వేడ్ (81 మ్యాచులు) లతో సెంచరికి చేరువలో ఉన్నారు.
ఈ మూడు ఫార్మాట్లలో 100 మ్యాచులు దాటిన ఆటగాళ్ల జాబితాల్లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. 113 టెస్టులు, 292 వన్డేలు, 117 టీ20లు ఆడాడు విరాట్ కోహ్లీ. ఇక న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ 112 టెస్టులు, 236 వన్డేలు, 102 టీ20లు ఆడాడు. ఇప్పటికే వన్టేలకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌తో తన క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వనున్నారు.