»Supreme Court Is Life Imprisonment A Punishment For Life Petition In The Supreme Court
Supreme Court: జీవిత ఖైదు అంటే జీవితాంతం శిక్షా..? సుప్రీంకోర్టులో పిటిషన్!
జీవిత ఖైదు అంటే జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలా? లేకపోతే CRPC సెక్షన్ 432 కింద ఆ శిక్షను తగ్గించడం లేదా రద్దు చేయడం అనే దానిపై ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. దీనిపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
Supreme Court: జీవిత ఖైదు అంటే జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలా? లేకపోతే CRPC సెక్షన్ 432 కింద ఆ శిక్షను తగ్గించడం లేదా రద్దు చేయవచ్చా అనే అంశంపై వివరణ ఇవ్వాలని కోరుతూ చంద్రకాంత్ ఝూ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 2006, 2007లలో తీహార్ జైలు బయట మూడు తలలేని మెండెంల కేసులో చంద్రకాంత్ ఝూ యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. చంద్రకాంత్ పిటిషన్పై స్పందన కోరుతూ జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. న్యాయవాది రిషి మల్హోత్రా ద్వారా దాఖలు చేసిన తన పిటిషన్లో ఐపీపీ సెక్షన్లు 302, 201 కింద తనకు శిక్ష విధించారని తెలిపారు.
తనకు ట్రయల్ కోర్టు విధించిన మరణవిక్షను ఢిల్లీ హైకోర్టు గతంలో యావజ్జీవ కారాగార శిక్షగా మార్చిందని పేర్కొన్నారు. ఐపీసీలోని సెక్షన్ 302 రెండు శిక్షలను స్పష్టంగా పేర్కొన్నదని, ఒకటి మరణశిక్ష, రెండోది యావజ్జీవ కారాగార శిక్ష అని తెలిపారు. ఈ రెండు మినహా మరే ఇతర శిక్షను ఇందులో పేర్కొనలేదని తన పిటిషన్లో ఝా తెలిపారు. యావజ్జీవ కారాగార శిక్షను జీవితాంతం వరకు అని పరిగణించినట్లయితే.. అది దోషిగా ఆ వ్యక్తి ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్టు అవుతుందని పిటిషన్ పేర్కొన్నది.