»The Story Of The Movie Baby Is Mine Short Film Director Complained
Baby Movie Controversy: బేబీ సినిమా కథ నాదే.. ఫిర్యాదు చేసిన షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన బేబీ చిత్రం చాలా పెద్ద విజయం సాధించింది. ఈ రోజుల్లో సాధారణంగా ఉండే కథ ఇది. అందుకే అందరికి బాగా కనెక్ట్ అయింది. తాజాగా ఈ కథ నాదే అంటూ ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
The story of the movie Baby is mine.. short film director complained
Baby Movie Controversy: బేబీ సినిమా కథ తనదే అంటూ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన రాసుకున్న కథతో కొన్నేళ్ల తర్వాత సినిమా తీసి కాపీరైట్ చట్టాన్ని దర్శకుడు సాయి రాజేష్ ఉల్లంఘించారని, తనపై చర్యలు తీసుకోవాలని శిరిన్ శ్రీరామ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. 2013లో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయాలని సాయిరాజేశ్ పలిపించారు.
అప్పటి నుంచి ఆయనతో పరిచయం ఉందని. 2015లో శ్రీరామ్ కన్నా ప్లీజ్ టైటిల్‌తో కథ రాసుకున్నట్లు, తరువాత దానికి ప్రేమించొద్దు అనే టైటిల్ పెట్టినట్లు శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సాయిరాజేశ్కు చెబితే బాగుందని చెప్పారు. తరువాత ఆయన సహకారంతో నిర్మాత శ్రీనివాస కుమార్‌నాయుడు గాదెకు కథను వినిపించాను. తరువాత తనకు ఏ మాత్రం చెప్పకుండా 2023లో సాయిరాజేశ్ అదే నిర్మాతతో, తన కథతో బేబీ సినిమా తిసినట్లు తెలిపారు. బేబీ కథ తన ప్రేమించొద్దు కథ ఒక్కటేనని శిరిన్ శ్రీరామ్ ఫిర్యాదులో వెల్లడించినట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతుందని పోలీసులు వెల్లడించారు.