Anand Devarakonda: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ వినుత్నమైన కథలను ఎంచుకొని ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ బేబి (Baby) సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. బేబీ సూపర్ హిట్ తరువాత కూడా కమర్షియల్ చిత్రాలను కాకుండా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ‘గం..గం..గణేశా’ (Gam Gam Ganesha) చిత్రాన్ని చేస్తున్నాడు. హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ఉదయ్ శెట్టి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్, టీజర్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టున్నాయి. తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. కామెడీనే ప్రధాన అంశంగా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపోతుంది. కడుపుబ్బ నవ్వించే డైలాగ్స్‌తో టీజర్ నచ్చింది మరి ట్రైలర్ ఎలా ఉంటుందో అని అందరూ వెయిట్ చేస్తున్నారు.