చివరగా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి' సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చిన సమంత.. ప్రస్తుతం సినిమా బ్రేక్‌లో ఉంది. కానీ నెక్స్ట్ అమ్మడి ప్లానింగ్ మాత్రం మామూలుగా లేదని తెలుస్తోంది. ఫస్ట్ సినిమాను బేబీ హీరోయిన్గా సెట్ చేస్తోందట.
Samantha with Baby Heroine? Is the plan out of the ordinary?
Samantha: ప్రస్తుతం సమంత నటించిన సినిమాలు ఒక్కటి కూడా లేవు. కానీ హిందీలో ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్‌తో వరుణ్ ధావన్‌తో కలిసి ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసింది సమంత. త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సిరీస్ షూటింగ్ అయిపోయిన తర్వాత మయోసైటిస్ కారణంగా.. కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయింది. అందుకే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. కానీ త్వరలోనే సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తోంది. అందుకోసం మాస్టర్ ప్లానింగ్‌తో రాబోతోంది. హీరోయిన్గా కొత్త సినిమాలు చేస్తునే.. మరోవైపు నిర్మాతగా కూడా రాణించడానికి ట్రై చేస్తోంది. ఇప్పటికే సొంత ప్రొడక్షన్ హౌజ్ స్థాపించిన సమంత.. ఫస్ట్ సినిమాను బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యతో ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పటికే వార్తాలు వచ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.
నిర్మాతగా ఫస్ట్ సినిమాతో అదరగొట్టాలని చూస్తున్న సామ్.. వైష్ణవితో లేడీ ఓరియేంటేడ్ ప్రాజెక్ట్ ఏమైనా ప్లాన్ చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. బేబీ సినిమాతో టాలీవుడ్‌ని షేక్ చేసింది వైష్ణవి. ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటోంది. గీతా ఆర్ట్స్, దిల్ రాజు బ్యానర్లో సినిమాలు చేస్తోంది. ఇక ఇప్పుడు సమంత నిర్మాణంలో సినిమా చేసేందుకు రెడీ అయినట్టుగా సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఇక నిర్మాతగా రాణిస్తునే హీరోయిన్గా కూడా మరో రెండు సినిమాలకు కమిట్ అయిందట సమంత. ఓ హాలీవుడ్ సినిమా కూడా చేస్తోంది. కానీ తెలుగు ఇండస్ట్రీకి మాత్రం సామ్ పూర్తిగా దూరమైనట్టే. అమ్మడి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. మరి సామ్ మళ్లీ తెలుగులో సినిమాలు చేస్తుందేమో చూడాలి.