వన్డే ప్రపంచ కప్‌లో తొలి మ్యాచ్‌లో భారత బౌలర్ల (Indian bowlers) అదరగొట్టారు.టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా(Australia)ను 49.3 ఓవర్లలో 199 పరుగులకు కట్టడి చేశారు. ఆసీస్‌ను భారత స్పిన్నర్లు వణికించారు. కుల్దీప్ యాదవ్, జడేజా తిప్పేయడంతో కంగారూలు ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటయ్యారు. మార్ష్ డకౌట్ అయ్యాక.. వార్నర్(Warner) (41), స్మిత్ (46) చక్కగా ఆడారు. ఆ తర్వాత కుల్దీప్, జడ్డూ విజృంభించడంతో వరుసగా వికెట్లు పడ్డాయి. చివర్లో స్టార్క్ (28). రాణించాడు. జడేజా 3, కుల్దీవ్ 2, బుమ్రా 2, అశ్విన్ (Ashwin) 1, హార్దిక్ 1, సిరాజ్ 1 వికెట్ తీశారు.భారత్ 50 ఓవర్లలో 200 రన్స్ చేయాలి.
భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మరో అరుదైన ఘనత సాధించాడు. ఆదివారం నాటి ప్రపంచకప్ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా వన్డేల్లో ఆస్ట్రేలియా జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా జడేజా రికార్డు నెలకొల్పాడు. ఇవాళ్టి మూడు వికెట్లతో కలిపి ఆసీస్‌పై జడేజా తీసిన వన్డే వికెట్ల సంఖ్య 37కు చేరింది.కపిల్ దేవ్ (Kapil Dev) 45 ఆసీస్ వికెట్లు తీసి జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 38 వికెట్లతో మహ్మద్ సమీ రెండో స్థానంలో నిలిచాడు. మరో రెండు వికెట్లు తీస్తే మహ్మద్ సమీని వెనక్కి నెట్టి జడేజా రెండో స్థానానికి చేరుకోనున్నాడు. ఇక జడేజా తర్వాత అజిత్ అగార్కర్ (36 వికెట్లు), జగగల్ శ్రీనాథ్ (33 వికెట్లు), హర్భజన్ సింగ్ (Harbhajan Singh) (32 వికెట్లు) వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు.