»12 Members Committee For Tdp And Janasena Coordination
12 Memberతో టీడీపీ- జనసేన కమిటీ, ఎవరు లీడ్ చేస్తారంటే..?
టీడీపీ- జనసేన కమిటీకి సంబంధించి స్పష్టత వచ్చింది. సోమవారం మధ్యాహ్నాం ప్రకటించి.. ఆ వారంలో ఫస్ట్ మీటింగ్ నిర్వహించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు.
12 Members Committee For TDP And Janasena Coordination
12 Members Committee: టీడీపీ-జనసేన పొత్తు కుదిరింది. ఇక మిగిలింది కమిటీ (Committee) ప్రకటించడమే. వాస్తవానికి చంద్రబాబు (Chandrababu) జైలు (jail) నుంచి విడుదలైన తర్వాత కమిటీని ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) అనుకున్నారు. స్కిల్ కేసులో రిమాండ్ పొడగింపుతో కమిటీని ప్రకటించాలని డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. కమిటీ ప్రకటన గురించి ఇటీవల జైలులో చంద్రబాబును కలిసిన లోకేశ్ చర్చించారని విశ్వసనీయ సమాచారం.
టీడీపీ- జనసేన పార్టీల ఉమ్మడి కార్యాచరణ రూపొందించేందుకు జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ నుంచి ఆరుగురు చొప్పున మొత్తం 12 మందితో కమిటీ ఉంటుంది. వీరిలో ఒకరు చైర్మన్, వైఎస్ చైర్మన్ పదవులు ఉంటాయి. టీడీపీ నుంచి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ ఉంటారు. వీరిలో ఒకరు చైర్మన్ అవుతారు.
మరో ఐదుగురు అభ్యర్థులను టీడీపీ ప్రకటించాల్సి ఉంది. జనసేన ఇప్పటికే తమ అభ్యర్థులను ఖరారు చేసింది. మహేందర్ రెడ్డి, కందుల దుర్గేశ్, యశస్విని, గోవింద్, బొమ్మిడి నాయక్ సభ్యులుగా ఉంటారని స్పష్టంచేసింది. కమిటీకి సంబంధించి ఇప్పటికే లోకేశ్‌కు పవన్ తెలియజేశారని.. బాబుతో మాట్లాడి మిగతా సభ్యులను టీడీపీ ఫైనల్ చేయాల్సి ఉంది.
సోమవారం కమిటీని ప్రకటించి.. ఆ వారంలోనే ఫస్ట్ మీటింగ్ నిర్వహించాలని జనసేనాని అనుకుంటున్నారు. ఎన్నికలకు సమయం సమీపిస్తోండటంతో లేట్ చేయొద్దని భావిస్తున్నారు. ఎంత త్వరగా జనాల వద్దకు వెళ్లే.. అంత మంచిదనే యోచనలో ఉన్నారు.