ప్రముఖ నటుడు బ్రహ్మాజీ (Brahmaji) నవీన్ నటన చూసి మొచ్చుకున్నాడు.నవీన్ టాలెంట్ చూస్తుంటే తనకు భయమేస్తోందన్నారు.ఇక తాను రిటైర్మెంట్ తీసుకోవడం బెటర్ అంటూ సరదాగా ట్వీట్ చేశారు. నవీన్ తాజాగా నటించిన ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). ఇంజినీరింగ్ గురించి ఈ సినిమాలో నవీన్ చెప్పే డైలాగ్‌ను.. ఇంజినీరింగ్ కష్టాలను ఉద్దేశించి గతంలో ఓ హిందీ సినిమాలో ఆయన చెప్పిన మరో డైలాగ్‌ను ఉపయోగించి ఓ నెటిజన్ (Netizen) వీడియో క్రియేట్ చేశాడు. ‘ఉత్తరాది లేదా దక్షిణాది.. ప్రాంతం ఏదైనా సరే నవీన్ పొలిశెట్టి ఇంజినీర్స్ వాయిస్’ అని ట్వీట్ చేశాడు.
దీనిపై నవీన్ (Naveen) ఆనందం వ్యక్తం చేశారు. ఈ వీడియో చూసిన బ్రహ్మాజీ తాజాగా ట్వీట్ చేశారు. ఫ్రస్ట్రేటెడ్ ఇంజినీరింగ్ స్టూడెంట్‌గా నవీన్ నటన చూసి ఫిదా అయ్యారు.మధ్య ప్రదేశ్‌లోని భోపాల్ NITలో ఇంజనీరింగ్ (Engineering) పూర్తి చేసిన నవీన్ తొలినాళ్ల నుంచే నటుడవ్వాలని కలలు కన్నాడు. దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మొదటి సారిగా శేఖర్ కమ్ముల (Shekhar Kammula) తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఓ చిన్న రోల్ చేశాడు. ఆ తర్వాత పలు షార్ట్ ఫిలింస్ చేశాడు. అయితే నాలుగేళ్ల కిందట వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా నవీన్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక రెండేళ్ల కిందట వచ్చిన జాతిరత్నాలు (Jathi Ratnalu) తిరుగులేని పాపులారిటీ తెచ్చిపెట్టింది.