Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కింగ్ నాగార్జున తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్లో టాప్ హీరోగా కొనసాగుతున్న కింగ్ ఒక పక్క సినిమా షుటింగ్‌లతో బిజీగా ఉంటూ మరోపక్క బిగ్ బాస్ షో చేస్తున్నాడు. ప్రస్తుతం నాగ్ 99వ సినిమా షుటింగ్తో బిజీగా ఉన్నాడు. విజయ్ బిన్నీ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘నా సామిరంగ’. ఆ తర్వాత నాగ్ 100వ సినిమాను లైన్లలో పెట్టనున్నాడు. ఇండస్ట్రీలో హీరోగా వంద సినిమాలు పూర్తి చేయడమంటే చిన్నవిషయం కాదు. ఇప్పటికీ చిరంజీవి 150వ మార్క్, బాలక్రిష్ణ 100వ మార్క్ దాటి దూసుకెళ్లిపోతున్నారు. ఏ హీరో అయిన 100వ సినిమా మంచి హిట్ కొట్టాలనే అనుకుంటారు. ఈ క్రమంలో నాగ్ తన 100వ చిత్రం విషయంలో కాస్త కన్ఫ్యూజన్గా ఉన్నారట.
కొన్నిరోజుల కిందట నాగ్ 100వ చిత్రానికి దర్శకుడు ఫిక్స్ అయ్యాడనే నెట్టింట చర్చ జరిగింది. తమిళ దర్శకుడు మోహన్ రాజా నాగ్ 100వ సినిమాను డైరక్ట్ చేస్తున్నాడని చాలాసార్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వేరే తమిళ డైరక్టర్ పేరు వినిపిస్తుంది. యాక్టర్‌గా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా టాలెంట్‌ను నిరూపించుకుంటూ కోలీవుడ్‌లో మంచి గుర్తింపు కోసం ట్రై చేస్తున్న నవీన్ దర్శకత్వంలో నాగ్ 100వ సినిమా చేయనున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నవీన్ ఇప్పటివరకు రెండు తమిళ చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు.