ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ విజయ్ 'లియో' సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. దీన్ని ఓ బుకింగ్ వైబ్‌సైట్ కన్ఫామ్ చేసింది. కానీ ఏది నిజమో? తేల్చుకోలేకపోతున్నారు మెగాభిమానులు.
Leo: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ లియో.. అక్టోబర్ 19న వరల్డ్ వైడ్‌గా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. విక్రమ్ వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా విజయ్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంటుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా లోకేష్ యూనివర్స్‌లో భాగంగానే రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నాడనే న్యూస్ వైరల్ అవుతోంది. చాలా రోజులుగా చరణ్ గెస్ట్ రోల్ గురించి వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పుడు రిలీజ్ టైం దగ్గర పడేకొద్ది నిజమేనని ఊహాగానాలు బలపడుతున్నాయి. దీనికి ఓ బలమైన కారణం కూడా ఉందంటున్నారు.
అమెరికాలో లియో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అందులో ఓ టికెట్ బుకింగ్ వెబ్సైట్.. లియో మూవీలోని నటీనటుల వివరాలు గురించి రాస్తూ.. రామ్ చరణ్ పేరు కూడా రాసింది. దీంతో లియోలో రామ్ చరణ్ క్యామియో ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. కానీ అసలు ఇలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ చెబుతోంది. కాబట్టి.. లియోలో చరణ్ గెస్ట్ రోల్ ఉండే అవకాశాలు లేవనే చెప్పాలి. ఒకవేళ ఉంటే మాత్రం సినిమా మామూలుగా ఉండదు. జస్ట్ రామ్ చరణ్ లియోలో ఉన్నాడనే న్యూసే సెన్సేషన్ క్రియేట్ చేస్తూ.. సినిమా పై సాలిడ్ హైప్ తీసుకొచ్చింది. ఇక సినిమాలో చరణ్ ఉంటే.. థియేటర్స్ షేక్ అయిపోతాయ్. మరి అసలు మ్యాటర్ తేలాలంటే.. లియో రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.