‘Animal’ ఫస్ట్ సింగిల్.. పోస్టర్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!
డిసెంబర్ నెలా సాలిడ్ హిట్‌తో బోణీ కొట్టేలా ఉంది. డిసెంబర్ 1న సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమా రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ బయటికొచ్చింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ రష్మిక ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించేలా ఉంది.
‘Animal’: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్లో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి.. ఇప్పుడు యానిమల్తో (Animal) పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు. రణ్‌బీర్ కపూర్, రష్మిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన యానిమల్ టీజర్ అదిరిపోయింది. రష్మిక, రణ్‌బీర్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయేలా ఉంటుందని చెప్పేశాడు సందీప్. ఈ సినిమా మామూలుగా ఉండదని బాలీవుడ్ వర్గాలు కూడా ఫిక్స్ అయిపోయాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ బయటికొచ్చింది. అమ్మాయి అంటూ సాగే మెలోడి సాంగ్‌ను బుధవారం రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ప్రైవేట్ జెట్‌లో రణ్‌బీర్, రష్మిక ఓ రేంజ్లో లిప్‌లాక్ చేసుకుంటున్నారు. దీంతో ఈ సినిమాలో రొమాన్స్ అర్జున్ రెడ్డికి మించి అనేలా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే యానిమల్‌లో ఫస్ట్ నైట్ సీన్‌ను ఓ రేంజ్లో డిజైన్ చేశారనే న్యూస్ వైరల్‌గా మారింది. రష్మిక, రణ్‌బీర్ ఫస్ట్ నైట్‌ను అత్యంత హింసాత్మకంగా ఉంటుందట. ఈ సీక్వెన్స్ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ పోస్టర్ దానికి ఓ శాంపిల్ అని చెప్పొచ్చు. ఇక తండ్రి కొడుకుల ఎమోషనల్‌తో పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనిల్ కపూర్.. రణ్‌బీర్ ఫాదర్‌గా కనిపించనున్నాడు. మనన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ సంస్థలు కలిసి సంయుక్తంగా యానిమల్ సినిమాను నిర్మిస్తున్నాయి.