»22 People Died In 24 Hours After Going For Holy Bath Bihar
19 women: పవిత్ర స్నానాల కోసం వెళ్లి 24 గంటల్లో 22 మంది మృతి
ఓ పండుగ సందర్భంగా అనేక మంది నదికి స్నానానికి వెళ్లారు. కానీ వారిలో పలువురు తిరిగి రాలేదు. ఆ క్రమంలో గత 24 గంటల్లో 22 మంది మరణించారు. ఈ ఘటన బీహార్‌లోని తొమ్మిది జిల్లాల్లో చోటుచేసుకుంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
22 people died in 24 hours after going for holy bath bihar
బీహార్(bihar) రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తొమ్మిది జిల్లాల్లో గత 24 గంటల్లో 19 మంది మహిళలు సహా మొత్తం 22 మంది మృత్యువాత చెందారు. అయితే వీరంతా ‘జితియా(Jitiya)’ పండుగ సందర్భంగా పవిత్ర స్నానాలు చేసేందుకు శనివారం సాయంత్రం వివిధ ఘాట్లకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం తెలిపారు. దీంతోపాటు మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల సాయం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం భోజ్‌పూర్ జిల్లాలోని చండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహియారా గ్రామంలో ఐదుగురు టీనేజ్ బాలికలు, జెహనాబాద్‌లో నలుగురు మహిళలు, పాట్నాలో ముగ్గురు, రోహ్తాస్లో ముగ్గురు, దర్భంగాలో ఇద్దరు, నవాడాలో ఇద్దరు, కైమూర్, మాధేపురాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
అయితే ప్రతి సారి ఈ పండుగ సందర్భంగా ప్రజలు నది లోతును గుర్తించకుండా పవిత్ర స్నానానికి బీహార్‌లోని నదీతీరాలకు వెళతారు. అనేక చోట్ల ఇసుక తవ్వకాలు చేయడం వల్ల చాలా ప్రదేశాలలో లోతు కనిపించదని పలువురు అంటున్నారు. నాలుగు అడుగుల నీటి మట్టంలో పలువురు స్నానం చేసి ముందుకు వెళ్లినప్పుడు ఇసుక తవ్వకాల గురించి తెలియక.. 10 అడుగుల లోయల్లో పడినట్లు NDRF అధికారులు చెబుతున్నారు. అయితే ఇలాంటి తవ్వకాలు తరచుగా ప్రమాదాలకు దారి తీస్తున్నానయని అధికారులు అంటున్నారు. ఇలాంటి క్రమంలో నదిలో ఇసుక తవ్వకాలు జరపకుండా అడ్డుకోవాలని కోరుతున్నారు.