»Police Intervention In Land Case Jangaon Ci Si Suspended Warangal Police Commissionerate
CI,SI suspended: ల్యాండ్ కేసులో పోలీసుల జోక్యం..సీఐ,ఎస్ఐ సస్పెండ్
ఇటివల కాలంలో పోలీసుల అక్రమ దాందాలు, భూ వివాదాల్లో జోక్యం కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే బంజారాహిల్స్(banjara hills)లో పలువురు పోలీసులు భూ దాందాలో జోక్యం చేసుకోవడం, అక్రమ వసూళ్లకు పాల్పడి అరెస్టు కాగా..తాజాగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా ఇద్దరు పోలీసులు భూ వివాదంలో జోక్యం చేసుకుని వేటుకు గురయ్యారు.
Police intervention in land case jangaon CI SI suspended warangal police commissionerate
మొన్న హైదరాబాద్(hyderabad) బంజారాహిల్స్ లో పలువురు పోలీసులు ఓ పబ్ నుంచి మాములు వసూళ్లు చేస్తూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆ క్రమంలో బాధిత వ్యాపారి ఏసీబీ అధికారులను ఆశ్రయించగా అధికారులు వారిని అదుపులోకి తీసుకుని నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా వరంగల్ కమిషనరేట్(warangal police commissionerate) పరిధిలో మరో ఇద్దరు అధికారులు భూ వివాదంలో జోక్యం చేసుకుని దందా నిర్వహించి దొరికిపోయారు. ఈ సంఘటన జనగామ జిల్లా నర్మెట్ట పరిధిలో చోటుచేసుకుంది. విషయం తెలిసిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్(cp ranganath) వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ఈ వివాదంలో జనగామ జిల్లా నర్మెట్ట సీఐ నాగబాబు, ఎస్ఐ అనిల్ ఉన్నారు. నర్మెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 30 ఏళ్లుగా ఓ భూ వివాదం కేసు కొనసాగుతుంది. దానిని అదునుగా చేసుకున్న నాగబాబు, అనిల్ కలిసి భూ కబ్జాదారులకు సహాకరించి బాధితులపైనే అక్రమ కేసులు పెట్టారు. ఆ క్రమంలో ఆయా బాధితులు విషయం వరంగల్ సీపీ రంగనాథ్ కు తెలిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సీపీ విచారణ జరిపించారు. ఆ క్రమంలో బాధితులను ఇబ్బందులకు గురిచేసినట్లు తేలడంతో పోలీస్ కమిషనర్ నాగబాబు, అనిల్ లపై చర్యలు తీసుకున్నారు. అయితే ఇది తెలిసిన స్థానికులు.. ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులే ఇలా భూదందాలో అక్రమాలు చేస్తే సామాన్య ప్రజలు(people) పోలీసులను ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు.