దసరా సెలవు రోజును తెలంగాణ సర్కార్ మార్పు చేస్తూ ప్రకటన చేసింది. అక్టోబర్ 23వ తేదీన దసరా సెలవు ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 24వ తేది కూడా సెలవుగా ప్రకటిస్తూ ఉత్వర్వులు ఇచ్చింది. వాస్తవానికి దసరా పండుగ విషయంలో చాలా మందికి కొంత సందిగ్ధత ఉంది. ఈ తరణంలో తెలంగాణ విద్యా శాఖ అక్టోబర్ 23వ తేదీన దసరా పండుగను నిర్వహించుకోవాలని తెలిపింది. దీంతో ప్రభుత్వం దసరా సెలవును మార్చుతూ ప్రకటన చేసింది.
అయితే ఇంతకుముందు ప్రకటించిన సెలవును సైతం తెలంగాణ సర్కార్ కొనసాగించడం విశేషం. పాఠశాల విద్యార్థులకు సెలవులతోపాటుగా మిగిలిన వారికి అక్టోబర్ 23, 24వ తేదీల్లో దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. బతుకమ్మ ప్రారంభం రోజును అక్టోబర్ 14న సాధారణ సెలవును ప్రకటించింది. అలాగే దుర్గాష్టమి అక్టోబర్ 22వ తేదిన ఐచ్చిక సెలవును ఇచ్చింది.
దసరా పండుగ నేపథ్యంలో పాఠశాలలకు దాదాపు 13 రోజులు, జూనియర్ కాలేజీలకు 7 రోజులు సెలవులను తెలంగాణ సర్కార్ ప్రకటించింది. తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రకారంగా జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25వ తేది వరకు సెలవులు ఉంటాయి. అక్టోబర్ 26వ తేదీన కాలేజీలు రీఓపెన్ అవుతాయి. ఈ క్రమంలో కాలేజీల్లో దసరా సెలవుల్లో ఎటువంటి ప్రత్యేక తరగతులు నిర్వహించొద్దని ఇంటర్మీడియట్ బోర్డు సూచించింది.