»Heavy Rain In Hyderabad The Weather Has Suddenly Changed
Heavy rain : హైదరాబాద్లో భారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం
హైదరాబాద్ (Hyderabad) లో భారీ వర్షం ముంచెత్తుతోంది. దీంతో వాహనాలుదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్(Hyderabad)లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం దాకా భానుడి భగభగలతో అల్లాడిన భాగ్యనగరం అకస్మాత్తుగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం (rain) కురుస్తున్నది. ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్(Banjara Hills), పంజాగుట్ట, అమీర్పేట, కూకట్పల్లి, బాలానగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం (heavy rain) కురిసింది. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు (stormy winds) వీయడంతో విద్యుత్ సరఫరా నిలిచింది. రోడ్ల మీదకు భారీగా వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గత కొద్దిరోజులుగా ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనం వర్షం కారణంగా కాస్త ఉపశమనం పొందారు. మరోవైపు.. నైరుతి రుతుపవనాలు జూన్ 7 నుంచి జూన్ 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందనీ, భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తన దీర్ఘకాలిక అంచనాలో తెలిపింది. అయితే మళ్లీ వడగాల్పులు పెరగడంతో ఈ స్పెల్ స్వల్పకాలం కొనసాగే అవకాశం ఉంది. జూన్ (June) నెలాఖరు నుంచి రాష్ట్రంలో రుతుపవనాలు తీవ్రరూపం దాల్చనున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం జూన్ 7 నుంచి 11 వరకు రుతుపవనాలు తెలంగాణ(Telangana)ను తాకుతాయి. రుతుపవనాల రాకతో మొదట్లో వర్షాలు తీవ్రంగా ఉంటాయనీ, వాతావరణ శాఖ తెలిపింది.