ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి చేయబోయే ప్రాజెక్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నాడు జక్కన్న. అయితే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేకపోతున్న రాజమౌళి.. కొత్త సినిమాలకు అదిరిపోయే రివ్యులు ఇస్తున్నాడు.
దర్శక ధీరుడు రాజమౌళికి ఈ వారం రిలీజ్ అయిన రెండు సినిమాలు తెగ నచ్చేశాయి. ఆ సినిమాలపై ప్రశంసలు కురిపిస్తు జక్కన్న చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాకు అప్రిసియేషన్లు దక్కుతున్నాయి.
సినిమా సూపర్ హిట్ అవుతుందని రిలీజ్ ముందు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయగా.. రాజమౌళి కూడా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘స్వీటీ అనుష్క, ఎప్పటిలాగే అందంగా తెరపై మెరిసింది, నవీన్ పోలిశెట్టి తన నటనతో నవ్వులు పూయించాడు, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో సక్సెస్ అందుకున్న టీమ్ మెంబర్స్ అందరికీ కంగ్రాట్స్, సెన్సిటివ్ అంశాన్ని ఇంత ఫన్‌తో సినిమా రూపొందించిన దర్శకుడు పి.మహేశ్ బాబుకు అభినందనలు’ అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు రాజమౌళి.
ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ పై కూడా ట్విట్టర్ ద్వారా రివ్యూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. ‘షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ బాద్షా అవ్వడానికి కారణం ఇదే. ఓపెనింగ్స్ తోనే బాక్సాఫీస్ ను బద్దలుకొట్టాడు. కంగ్రాట్స్ అట్లీ.. అద్భుతమైన విజయం సాధించిన జవాన్ టీమ్‌కు అభినందనలు’ అని చెప్పుకొచ్చాడు. ఇక అంతకు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘జవాన్’ సినిమా చూసి సూపర్ అంటూ రివ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే.