యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్్లో సంచలనం సృష్టించాడు సందీప్ రెడ్డి. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసి అదరగొట్టాడు సందీప్. ఇక ఇప్పుడు యానిమల్తో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు.
ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగ చేసింది ఒక్కటే సినిమా. కానీ ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో ప్రాజెక్ట్స్ ఓకె చేయించుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాను షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ చేసి హిట్ కొట్టిన సందీప్.. రెండో సినిమాను బాలీవుడ్ హీరోతో చేస్తున్నాడు. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ అనే ఊరమాస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన నటిస్తోంది. ఇప్పటికే విడుదల అయిన యానిమల్ ప్రీ టీజర్ అదిరిపోయింది.
మాస్క్ పెట్టుకుని ఊచకోత కోసిన రణ్ బీర్‌ను చూసి బాలీవుడ్ జనాలు షాక్ అయ్యారు. జస్ట్ ప్రీ టీజరే ఇలా ఉంటే.. ఇక టీజర్ ఇంకే రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. తాజాగా ఈ సినిమా టీజర్ డేట్ లాక్ అయినట్టు తెలుస్తోంది. యానిమల్ టీజర్‌ను రణ్‌బీర్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వగా టీజర్ కట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట. దీంతో ఈ టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.
సందీప్ నుంచి రాబోతున్న ఈ సెకండ్ ఫిల్మ్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోను ఉంది. యానిమల్ టీజర్‌తో ఈ సినిమా కథ పై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇకపోతే.. ఈ సినిమాను ముందుగా ఆగస్టు 11న రిలీజ్ చేయాలని అనుకున్నాడు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ డిలే అవడం వల్ల డిసెంబర్‌కు పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమాను భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. మరి యానిమల్ ఎలా ఉంటుందో చూడాలి.