»Do You Know Anushka Shetty Remuneration In Miss Shetty Mr Polishetty Naveen Polishetty
Anushka Shetty: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో అనుష్క రెమ్యూనరేషన్ ఎంతో తెలసా.?
యంగ్ హీరో జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ బ్యూటీ అనుష్క శెట్టి ఇద్దరు కలిసి నటిస్తున్న తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ చిత్రంలో అనుష్క రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసిందట.
Do you know Anushka Shetty remuneration in Miss Shetty Mr. Polishetty. Naveen Polishetty
Anushka Shetty: తెలుగు పరిశ్రమలో సూపర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చీ ఆ తరువాత స్టార్ హీరోయిన్గా ఎదిగారు అనుష్క శెట్టి(Anushka Shetty). బెంగుళూరుకు చెందిన ఈ అందాల భామ గత దశాబ్దన్నర నుంచి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ(South Film Industry)లో స్టార్ హీరోయిన్ రాణిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో అందరి అగ్రహీరలతో యాక్ట్ చేసి మెప్పించింది. కొన్నాళ్లుగా అనుష్కకు సరైన సినమాలు లేవనే చెప్పాలి. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తరువాత భాగమతి సినిమా ఒకటి థియేటర్లో ఆడింది. తరువాత వచ్చిన నిశ్శబ్దం సినిమా డైరెక్ట్ ఓటీటీలో విడుదల అయ్యింది. అది పెద్దగా ప్రేక్షాదరణ పొందలేదనే చెప్పాలి. 4 సంవత్సరాల తరువాత మళ్లీ వెండితెరపై అలరించడానికి మనముందుకు వస్తున్న తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Miss Shetty Mr. Polishetty). ఆ సినిమాలో అనుష్క రెమ్యూనరేషన్ గురించి ఒక విషయం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది.
అన్విత రవళి పాత్రతో ఒక చెఫ్‌గా మనల్ని అలరించడానికి సిద్దం అయింది. జాతి రత్నాలు ఫేమ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోగా, పి. మహేష్ కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా కృష్ణాష్టమి పండుగ కానుకగా సెప్టెంబర్ 7న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అనుష్క సినిమాలకు గ్యాప్ వచ్చినా కూడా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని.. ఈ సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్‌ను బట్టి చూస్తుంటే అర్థం అవుతుంది. మూవీ కోసం ఆమె ఏకంగా రూ. 6 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. లాక్డౌన్ ముందు తాను ఒక్క సినిమాకు రూ. 3 కోట్ల వరకు తీసుకునేది. కాని ఇప్పుడు దానికి డబుల్ చేసింది అని అంటున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ అయితే సినిమాపై మంచి అంచనాలు పెంచాయి.