Actress Jayaprada said that girls are giving commitment for film opportunities.
Jayaprada: సినీ పరిశ్రమలో హీరోయిన్స్ ఎదుర్కొనే సమస్య కాస్టింగ్‌కౌచ్ (Castingcouch). బాలీవుడ్లో మీటు (Me too) ఉద్యమం పేరుతో దూమరమే రేగింది. ఈ వివాదంపై సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద (Jayaprada) కామెంట్ చేశారు. వారి రోజుల్లో ప్రతిభా ఉంటే ఏదో రోజు అవకాశం వస్తుందని నమ్మకంతో ఉండేవారని, అలాగే దర్శక నిర్మాతలు కూడా వ్యవహరించే వారని.. టాలెంట్ ఉన్నవారిని గుర్తించి అవకాశాలు ఇచ్చేవారని పేర్కొన్నారు. పరిస్థితి మారిందని.. అమ్మాయిలే అవకాశాల కోసం కమిట్ అవుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి.
ఇండస్ట్రీలో కొందరు ఇలా చేయడం వల్ల కాస్టింగ్‌కౌచ్ (Castingcouch) వాతావరణం ఇండస్ట్రీలో నెలకొంది. టాలెంట్ ఉన్నవారు కూడా కాస్టింగ్ కౌచ్ ఉచ్చులో పడుతున్నారని జయప్రద తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తెలుగు నుంచి వచ్చిన ఎందరో అమ్మాయిలు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి విజయం సాధించారు. ఇండస్ట్రీలో మంచి సినిమాలో నటించి అగ్ర తారలుగా వెలిగారు. ఆంధ్రప్రదేశ్‌లో గల తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పుట్టి పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో రాణించారు. ప్రస్తుతం పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయ్యారు.
కొంతమంది అమ్మాయిలు అవకాశాల కోసం నిర్మాతల, డైరెక్టర్ల దగ్గర తప్పుగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. అమ్మాయిలు సిన్సియర్‌గా ఉండి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు సున్నితంగా తిరస్కరిస్తే ఆ సమస్య అక్కడితో ఆగిపోతుందని వెల్లడించారు. వారి రోజుల్లో అలాంటి వాతావరణం లేదని, తను అలాంటి పరిస్థితిని ఎప్పుడు ఫేస్ చేయలేదని చెప్పారు. సీనయర్ నటలు ఇలా స్పందిస్తే చాలా వరకు యువతకు ఆత్మస్థైర్యం ఏర్పడుతుందని పలువురు అంటున్నారు.