»Game Changer Charans Increased Remuneration All Crores At Once
Game changer: గేమ్ చేంజర్.. పెరిగిన చరణ్ పారితోషికం, ఏకంగా అన్ని కోట్లా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్లో ఉంది. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనేది హాట్ టాపిక్‌గా మారింది.
Game changer: ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత మరో టాప్ డైరెక్టర్ శంకర్‌తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న 50వ సినిమా అవడంతో.. ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కుతోంది గేమ్ చేంజర్. షూటింగ్ లేట్ అయినా కూడా.. ఖచ్చితంగా ఈ సినిమాతో శంకర్ వెయ్యి కోట్ల సినిమా ఇవ్వబోతున్నాడనే నమ్మకంతో ఉన్నారు మెగాభిమానులు. అక్టోబర్ నెలకు అటు ఇటుగా గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే.. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల సమయం కేటాయించాడు చరణ్. ఈ గ్యాప్‌లో చరణ్ స్పీడ్‌కు మరో సినిమా కంప్లీట్ అయ్యేది. కానీ అలా జరగలేదు. గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశకు వచ్చిన తర్వాతే.. బుచ్చిబాబుతో సినిమా లాంచ్ చేశాడు చరణ్.
మరి.. ఇంతలా లేట్ అవుతున్న గేమ్ చేంజర్ కోసం.. చరణ్ రెమ్యూనరేషన్ ఎంత? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు 45 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడు చరణ్. కానీ గేమ్ చేంజర్‌కు ఏకంగా 120 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం. గతంలో భారీ పారితోషికం అందుకుంటున్నాడని అనుకున్నారు.. కానీ అనుకున్న సమయం కంటే ఎక్కువ తీసుకోవడంతో మరింత పెరిగిందని టాక్. దీంతో మొత్తంగా 120 కోట్ల రెమ్యునరేషన్‌ని గేమ్ ఛేంజర్ కోసం తీసుకుంటున్నట్టుగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఇక్కడి నుంచి చరణ్ పారితోషికం వంద కోట్లకు పైగానే ఉంటుందని చెప్పాలి.