»Ashwin Becomes First Indian Bowler To Dismiss Father Son In His Test Career
Ashwin అదుర్స్.. తండ్రి, కుమారుడిని ఔట్ చేసి రికార్డ్
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఫిట్ సాధించాడు. వెస్టిండీస్‌కు చెందిన టాగెనరైన్, అతని తండ్రి శివ్ నరైన్‌ను ఔట్ చేసి రికార్డు సృష్టించాడు.
Ashwin becomes first Indian bowler to dismiss father, son in his test career
Ashwin: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) అరుదైన ఫిట్ సాధించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ తొలి ఇన్సింగ్స్‌లో విండీస్ బ్యాట్స్‌మెన్ టాగెనరైన్ చంద్రపాల్‌ను పెవిలియన్‌కు పంపించాడు. అంతకుముందు అశ్విన్ (Ashwin) అతని తండ్రి శివ్‌నరైన్ చంద్రపాల్‌ను ఔట్ చేశాడు. సో.. ఇంటర్నేషనల్ క్రికెట్లో తండ్రి, కుమారులను వెనక్కి పంపిన తొలి ఇండియన్ బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) చరిత్ర సృష్టించాడు.
అశ్విన్ (Ashwin) 2011లో వెస్టిండీస్‌తో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ సమయంలో ఇప్పటి టాగెనరైన్ తండ్రి శివ్నరైన్ను ఔట్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో అతని వికెట్ తీశాడు. ఇప్పుడు అతని కుమారుడు టాగెనరైన్ వికెట్ చేశాడు. దీంతో టెస్ట్‌ల్లో అశ్విన్ (Ashwin) తీసిన వికెట్ల సంఖ్య 474కి చేరింది. అన్నీ ఫార్మాట్లలో కలిపి అశ్విన్ (Ashwin) తీసిన వికెట్ల సంఖ్య 699కి చేరింది. తండ్రి, కుమారుల వికెట్ తీసిన బౌలర్లలో అశ్విన్ (Ashwin) ప్రపంచంలో ఐదో స్థానంలో నిలిచాడు.
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మైఖేల్ స్టార్క్, సౌతాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ సైమన్ హర్మర్ కూడా టాగెనరైన్, శివ్ నరైన్ వికెట్లను తీశారు. శివ్ నరైన్ 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అతని కుమారుడు గత ఏడాది టెస్ట్ క్రికెట్‌తో ఆరంగ్రేటం చేశాడు. న్యూజిలాండ్‌కు చెందిన లాన్స్, క్రిస్ కెర్న్స్ వికెట్లను ఇంగ్లండ్ ఆల్ రౌండర్ల ఇయామ్ బోథమ్, పాకిస్థాన్ పేసర్ వసీం అక్రమ్ తీశారు.