ముంబైపై హాఫ్ సెంచరీ(77*) చేయడం ద్వారా రాజస్థాన్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. RR తరఫున అత్యధిక 50+ స్కోర్స్ చేసిన ఆటగాడిగా రహానే(19) సరసన రెండో స్థానంలో నిలిచాడు. చెరో 25 సార్లు ఈ ఫీట్ నమోదు చేసిన జోస్ బట్లర్, సంజూ శాంసన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈ టోర్నీ ముగిసేవరకు జైస్వాల్ ఇదే ఫామ్‌లో ఆడితే.. బట్లర్, శాంసన్‌ని దాటేసే ఛాన్స్ ఉంటుంది.