రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. IPLలో 10 మ్యాచ్లు ఆడిన వైభవ్.. 171 బంతుల్లోనే 35 సిక్సర్లు కొట్టాడు. అంటే సగటున ప్రతి 4.88 బంతులకు ఒక సిక్సర్ బాదాడు. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యల్పం. ఈ జాబితాలో రొమారియో షెపర్డ్(5.1), ఉర్విల్ పటేల్(5.3), జేక్ మెక్గుర్క్(6.4), రసెల్(6.8) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.